Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 251 Old No: 565

ఎంతటివాడను నేను

Entativaadanu Nenu

Open in Word & Worship App
తెలుగు   ఎంతటివాడను నేను
పల్లవి
ఎంతటి వాడను నేను ఏసయ్యా - కొంతైన యోగ్యుడను కానయ్యా
ఇంతగ నను హెచ్చించుటకు - ఈ స్థితిలో నన్నుంచుటకు
1)
ఐశ్వర్యము గొప్పతనమును - కలిగించు దేవుడ నీవే
హెచ్చించు వాడవును - బలమిచ్చువాడవు నీవే
అల్పుడను మంటి పురుగును - నన్ను ప్రేమించినావు
ప్రాణమును నీ సర్వమును - నా కొరకై అర్పించినావు
|| ఎంతటి ||
2)
నిను వెంబండించు వారిని - నిజముగ సేవించు వారిని
నీవుండే స్థలములలో - నిలిచే నీ సేవకుని
ఎంతో ఘనపరచెదవు - ఆశీర్వదించెదవు
శతృవుల కంటే ఎత్తుగా - అతని తలను పైకెత్తెదవు
|| ఎంతటి ||
3)
వినయముగల మనుష్యులను - వర్ధిల్లజేసెదవు
గర్విష్టుల గర్వము నణచి - గద్దె నుండి దించెదవు
మాదు ఆశ్రయ దుర్గమా - మేమంతా నీవారమే
మా శైలము మా కేడెమా - మాకున్నదంత నీ దానమే
|| ఎంతటి ||
English   Entativaadanu Nenu
Chorus
Entati Vaadanu Nenu esayyaa - Kontaina Yogyudanu Kaanayyaa
Intaga Nanu Hechchinchutaku - Ee Sthitilo Nannunchutaku
1)
Aisvaryamu Goppatanamunu - Kaliginchu Devuda Neeve
Hechchinchu Vaadavunu - Balamichchuvaadavu Neeve
Alpudanu Manti Purugunu - Nannu Preminchinaavu
Praanamunu Nee Sarvamunu - Naa Korakai Arpinchinaavu
|| Entati ||
2)
Ninu Venbandinchu Vaarini - Nijamuga Sevinchu Vaarini
Neevunde Sthalamulalo - Niliche Nee Sevakuni
Ento Ghanaparachedavu - Aaseervadinchedavu
Satruvula Kante Ettugaa - Atani Talanu Paikettedavu
|| Entati ||
3)
Vinayamugala Manushyulanu - Vardhillajesedavu
Garvishtula Garvamu Nanachi - Gadde Nundi Dinchedavu
Maadu Aasraya Durgamaa - Memantaa Neevaarame
Maa Sailamu Maa Kedemaa - Maakunnadanta Nee Daaname
|| Entati ||
Present