Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 247 Old No: 420

పొందితిని నేను ప్రభువా

Ponditini Neenu Prabhuvaa

Open in Word & Worship App
తెలుగు   పొందితిని నేను ప్రభువా
పల్లవి
పొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శేష్ట యీవులన్‌ ఈ భువియందు
1)
జీవిత యాత్రలో సాగి వచ్చితిని - ఇంతవరకు నాకుతోడై యుండి
ఎబినేజరువైయున్న ఓ యేసుప్రభువా - నా రక్షణ కర్తవు నీవైతివి
|| పొంది ||
2)
గాలి తుఫానులలో నుండి వచ్చితిని - అంధకారశక్తుల ప్రభావము నుండి
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా
నీవే నా ఆశ్రయ దుర్గంబైతివి
|| పొంది ||
3)
కష్ట దుఃఖంబులు నాకు కలుగగా - నను చేరదీసి ఓదార్చితివే
భయభీతి నిరాశల యందున ప్రభువా
బహుగా ధైర్యంబు నా కొసగితివి
|| పొంది ||
4)
నా దేహమందున ముల్లునుంచితివి - సాతానుని దూతగా నలుగగొట్టన్‌
వ్యాధి బాధలు బలహీనతలయందు
నీ కృపను నాకు దయచేసితివి
|| పొంది ||
5)
నీ ప్రేమ చేత ధన్యుడనైతిని - కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
కష్టపరీక్షల యందున ప్రభువా
జయ జీవితము నాకు నేర్పించితివి
|| పొంది ||
English   Ponditini Neenu Prabhuvaa
Chorus
Ponditini Nenu Prabhuvaa Nee Nundi
Prati Seshta Yeevulan Ee Bhuviyandu
1)
Jeevita Yaatralo Saagi Vachchitini - Intavaraku Naakutodai Yundi
Ebinejaruvaiyunna O Yesuprabhuvaa - Naa Rakshana Kartavu Neevaitivi
|| Pondi ||
2)
Gaali Tuphaanulalo Nundi Vachchitini - Andhakaarasaktula Prabhaavamu
Nundi
Nee Rekkala Chaatuna Nanu Daachitivayyaa
Neeve Naa Aasraya Durganbaitivi
|| Pondi ||
3)
Kashta DuHkhanbulu Naaku Kalugagaa - Nanu Cheradeesi Odaarchitive
Bhayabheeti Niraasala Yanduna Prabhuvaa
Bahugaa Dhairyanbu Naa Kosagitivi
|| Pondi ||
4)
Naa Dehamanduna Mullununchitivi - Saataanuni Dootagaa Nalugagottan
Vyaadhi Baadhalu Balaheenatalayandu
Nee Krupanu Naaku Dayachesitivi
|| Pondi ||
5)
Nee Prema Cheta Dhanyudanaitini - Krutagnaataastutulu Chellinchedanu
Kashtapareekshala Yanduna Prabhuvaa
Jaya Jeevitamu Naaku Nerpinchitivi
|| Pondi ||
Present