Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 246 Old No: 240

విశ్వాసీ నీ భాగ్యమెంత

Vishvaasi Nee Bhaagyamenta

Open in Word & Worship App
తెలుగు   విశ్వాసీ నీ భాగ్యమెంత
పల్లవి
విశ్వాసీ నీ భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా!
యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు
1)
శ్రీమంతుడు మహాదేవుడే - తన వారసునిగ జేసెను
నీ కొరకు తను పేదయై నిను - ఆస్తికర్తను జేసెను
|| వి ||
2)
ఈ లోకములో ఏ సంపదలు - సాటిరావాధనముతో
ఆలోకములో దాచియుంచిన - అక్షయంబగు భాగ్యము
|| వి ||
3)
రాజువైన యాజకునిగా - నిన్ను అభిషేకించెను
విజయవీరుని విందు శాలలో - భోజనం బేర్పరచెను
|| వి ||
4)
రక్షించి నిను పరలోకములో - ఆసీనునిగా జేసెను
ఇహలోకములో సేదదీరుటకు - తనదు వాక్యము నిచ్చెను
|| వి ||
5)
యేసు లేకయే ధనము కలిగిన ఓయీ ....... దరిద్రుండా!
నీదు హృదయము ప్రభువు కీయుము - పరమభాగ్యము పొందుము
|| వి ||
English   Vishvaasi Nee Bhaagyamenta
Chorus
Visvaasee Nee Bhaagyamenta Goppado Erigitivaa!
Yesu Prabhuvu Vimochinchina Ninnu Polina Vaadevadu
1)
Sreemantudu Mahaadevude - Tana Vaarasuniga Jesenu
Nee Koraku Tanu Pedayai Ninu - Aastikartanu Jesenu
|| Vi ||
2)
Ee Lokamulo e Sanpadalu - Saatiraavaadhanamuto
Aalokamulo Daachiyunchina - Akshayanbagu Bhaagyamu
|| Vi ||
3)
Raajuvaina Yaajakunigaa - Ninnu Abhishekinchenu
Vijayaveeruni Vindu Saalalo - Bhojanan Berparachenu
|| Vi ||
4)
Rakshinchi Ninu Paralokamulo - Aaseenunigaa Jesenu
Ihalokamulo Sedadeerutaku - Tanadu Vaakyamu Nichchenu
|| Vi ||
5)
Yesu Lekaye Dhanamu Kaligina Oyee ....... Daridrundaa!
Needu Hrudayamu Prabhuvu Keeyumu - Paramabhaagyamu Pondumu
|| Vi ||
Present