Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 244 Old No: 200

రుచిమాచి ఎరిగితిని

Ruchichoochi Erigitini

Open in Word & Worship App
తెలుగు   రుచిమాచి ఎరిగితిని
పల్లవి
రుచిచూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు
రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని
1)
గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే
తప్పక ఆరాధింతు - దయాళుడవు నీవే
|| రుచి ||
2)
మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా
మనసారా పొగడెద నీదు - ఆశ్చర్యకార్యములన్‌
|| రుచి ||
3)
మంచితనము గల దేవా - అతి శ్రేష్ఠుడవు అందరిలో
ముదమార పాడెద నిన్ను - అతి సుందరుడవనియు
|| రుచి ||
4)
నా జీవిత మంతయును - యెహోవాను స్తుతియించెదను
నా బ్రతుకు కాలములో - నా దేవుని కీర్తింతు
|| రుచి ||
5)
సంతోషింతును ఎల్లప్పుడు - కష్ట దుఃఖ బాధలలో
ఎంతో నెమ్మది నిచ్చు - నా రక్షకుడు యేసు
|| రుచి ||
6)
ప్రార్థింతును ఎడతెగక - ప్రభుసన్నిధిలో చేరి
పరిపూర్ణముగ పొందెదను - అడుగు వాటన్నిటిని
|| రుచి ||
7)
కృతజ్ఞత చెల్లింతు - ప్రతిదానికొరకు నేను
క్రీస్తేసునందే తృప్తి - నొంది హర్షించెదను
|| రుచి ||
English   Ruchichoochi Erigitini
Chorus
Ruchichoochi Erigitini - Yehovaa Uttamudaniyu
Rakshaku Naasrayinchi - Ne Dhanyudanaitini
1)
Goppa Devudavu Neeve - Stutulaku Paatruda Neeve
Tappaka Aaraadhintu - Dayaaludavu Neeve
|| Ruchi ||
2)
Mahonnatudavagu Devaa - Prabhaavamu Galavaadaa
Manasaaraa Pogadeda Needu - Aascharyakaaryamulan
|| Ruchi ||
3)
Manchitanamu Gala Devaa - Ati Sreshthudavu Andarilo
Mudamaara Paadeda Ninnu - Ati Sundarudavaniyu
|| Ruchi ||
4)
Naa Jeevita Mantayunu - Yehovaanu Sthuthiyinchedanu
Naa Bratuku Kaalamulo - Naa Devuni Keertintu
|| Ruchi ||
5)
Santoshintunu Ellappudu - Kashta DuHkha Baadhalalo
Ento Nemmadi Nichchu - Naa Rakshakudu Yesu
|| Ruchi ||
6)
Praarthintunu Edategaka - Prabhusannidhilo Cheri
Paripoornamuga Pondedanu - Adugu Vaatannitini
|| Ruchi ||
7)
Krutagnaata Chellintu - Pratidaanikoraku Nenu
Kreestesunande Trupti - Nondi Harshinchedanu
|| Ruchi ||
Present