తెలుగు రక్షణ జైన్యత్యము
పల్లవిరక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును
పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది
1)మలిన వస్త్రమువలెనే - నిండియుంటిమి నిందలతో
తండ్రి మాదిరిగా మము వెదకివచ్చి - వింతగా మమ్ము రక్షించెన్
|| రక్ష ||
2)అరణ్య ప్రదేశములో - పాడైన యెడారిలో
కనుగొనెను, పరామర్శించెను - కనుపాపవలె గాచెన్
|| రక్ష ||
3)యాకోబువలె నుంటిమి - ఇశ్రాయేలుగా మార్చెను
తన స్వాస్థ్యముగా, తన భాగముగా - తన జనముగా నైతిమి
|| రక్ష ||
4)పర్వతములను సృజించెన్ - శ్రేష్ఠమైనవి నిచ్చెన్
అబ్రహాం మోషే ఏలియా యేసు - ఎక్కిరి శిఖరములను
|| రక్ష ||
5)పక్షిరాజువలె ప్రభువు - పర్వత శిఖరములు
పరిపూర్ణమగు ప్రభు రక్షణను - పరికింప జేయును
|| రక్ష ||
6)యెషయా ప్రవచనములు - రక్షణ వివరములు
శిఖర శ్రేణి యనుభవములు - శిఖరముపై పొందుము
|| రక్ష ||
English Rakshana Jainyathyamu
ChorusRakshana Aunnatyamu Rakshakude Telupunu
Parvata Sikhara Srenulavalene Nischalamainadi
1)Malina Vastramuvalene - Nindiyuntimi Nindalato
Tandri Maadirigaa Mamu Vedakivachchi - Vintagaa Mammu Rakshinchen
|| Raksha ||
2)Aranya Pradesamulo - Paadaina Yedaarilo
Kanugonenu, Paraamarsinchenu - Kanupaapavale Gaachen
|| Raksha ||
3)Yaakobuvale Nuntimi - Israayelugaa Maarchenu
Tana Svaasthyamugaa, Tana Bhaagamugaa - Tana Janamugaa Naitimi
|| Raksha ||
4)Parvatamulanu Srujinchen - Sreshthamainavi Nichchen
Abrahaan Moshe eliyaa Yesu - Ekkiri Sikharamulanu
|| Raksha ||
5)Pakshiraajuvale Prabhuvu - Parvata Sikharamulu
Paripoornamagu Prabhu Rakshananu - Parikinpa Jeyunu
|| Raksha ||
6)Yeshayaa Pravachanamulu - Rakshana Vivaramulu
Sikhara Sreni Yanubhavamulu - Sikharamupai Pondumu
|| Raksha ||