Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 240 Old No: 151

ఆనందముగా ప్రభుయేసు

Aanandamugaa Prabhuyesu

Open in Word & Worship App
తెలుగు   ఆనందముగా ప్రభుయేసు
పల్లవి
ఆనందముగా ప్రభుయేసు నీ కృపలన్నీ - అన్ని కాలంబులందు కీర్తించెదన్‌
1)
చావు గోతి నుండి - లేవనెత్తి నాకు జీవమిచ్చిన - జీవదాతా
వివరింతునే - నీదు విశ్వాస్యత నెంతయో సవ్యంబుగా
ఈ భువియందున
|| ఆ ||
2)
సింహపు పిల్లలు - ఆకలి గొనును యెహోవా సహాయుడందరికి
ఇహ మందున ఏ మేలు కొదువ యుండదు ఆహా! ఏమందు
నీ విశ్వాస్యతన్‌
|| ఆ ||
3)
ఎన్నెన్నో శోధన - బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్‌ - ఘనమైన
నీ విశ్వాస్యతన్‌ నాకు జూపిన కన్నతండ్రి నిన్ను కొనియాడెదన్‌
|| ఆ ||
4)
చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవజూపి దేవతోడై
నడిపించితివి నీ కృపన్‌ వివరించెద నీ విశ్వాస్యతన్‌
|| ఆ ||
5)
నీతి న్యాయంబులు - ఆధారములై నీ సింహాసనమున - నిలచినవి
నిత్య కృపాసత్యంబులు - నీదు సన్నిధిన్‌ - నిరతంబు వెలసి
నిలచినవి
|| ఆ ||
6)
పర్వతంబులు - పారిపోయినను ఉర్విలో మార్పు కలిగినను
తరుణములు విరోధముగ పై లేచిన స్మరియించెద నీ విశ్వాస్యతన్‌
|| ఆ ||
English   Aanandamugaa Prabhuyesu
Chorus
Aanandamugaa Prabhuyesu Nee Krupalannee - Anni Kaalanbulandu
Keertinchedan
1)
Chaavu Goti Nundi - Levanetti Naaku Jeevamichchina - Jeevadaataa
Vivarintune - Needu Visvaasyata Nentayo Savyanbugaa
Ee Bhuviyanduna
|| Aa ||
2)
Sinhapu Pillalu - Aakali Gonunu Yehovaa Sahaayudandariki
Iha Manduna e Melu Koduva Yundadu Aahaa! emandu
Nee Visvaasyatan
|| Aa ||
3)
Ennenno Sodhana - Baadhalu Regi Nannu Krngadeeya Poraadinan - Ghanamaina
Nee Visvaasyatan Naaku Joopina Kannatandri Ninnu Koniyaadedan
|| Aa ||
4)
Chaavu Cheekatla Loyalanduna Jeevapu Velugai Trovajoopi Devatodai
Nadipinchitivi Nee Krupan Vivarincheda Nee Visvaasyatan
|| Aa ||
5)
Neeti Nyaayanbulu - Aadhaaramulai Nee Sinhaasanamuna - Nilachinavi
Nitya Krupaasatyanbulu - Needu Sannidhin - Niratanbu Velasi
Nilachinavi
|| Aa ||
6)
Parvatanbulu - Paaripoyinanu Urvilo Maarpu Kaliginanu
Tarunamulu Virodhamuga Pai Lechina Smariyincheda Nee Visvaasyatan
|| Aa ||
Present