తెలుగు అనుదినము మా భారము
పల్లవిఅనుదినము మా భారము - భరించె దేవా
అనిశము నీ మేళ్లతో - నింపుచున్నావు (2సార్లు)
1)సన్నుతించు మనిశము - నా ప్రాణమా యేసుని - పరిశుద్ధ
నామమును పొగడు మెప్పుడు ఒంటె బరువు దీవెనలు
వీపున మోపె
|| అను ||
2)నా శరీరమున ముల్లు - బాధపరచుచుండగా వేదనతో వేడగా
ధైర్యమిచ్చితివి నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి
|| అను ||
3)అపరాధముతో మేము చిక్కుకొనియుండగా నీ రక్తముచే
మమ్ము విమోచించితివి నీదు కృపామహదైశ్వర్యంబును బట్టి
|| అను ||
4)అన్నిటిలో నెప్పుడు - సకల సంపదలతోను సమృద్ధితో
మమ్ములను సాకుచుంటివి కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి
|| అను ||
5)సర్వవేళల సంతృప్తిని - నేర్పినావు మాకిల సకలంబును
చేయుటకు - శక్తినిచ్చితివి బలపరచుము నిన్నుబట్టి బలుడగు దేవా
|| అను ||
English Anudinamu Maa Bhaaramu
ChorusAnudinamu Maa Bhaaramu - Bharinche Devaa
Anisamu Nee Mellato - Ninpuchunnaavu (2saarlu)
1)Sannutinchu Manisamu - Naa Praanamaa Yesuni - Parisudha
Naamamunu Pogadu Meppudu Onte Baruvu Deevenalu
Veepuna Mope
|| Anu ||
2)Naa Sareeramuna Mullu - Baadhaparachuchundagaa Vedanato Vedagaa
Dhairyamichchitivi Naa Krupa Neekellappudu Chaalunantivi
|| Anu ||
3)Aparaadhamuto Memu Chikkukoniyundagaa Nee Raktamuche
Mammu Vimochinchitivi Needu Krupaamahadaisvaryanbunu Batti
|| Anu ||
4)Annitilo Neppudu - Sakala Sanpadalatonu Samrddhito
Mammulanu Saakuchuntivi Krupaakshemamulanu Maapai Kummarinchitivi
|| Anu ||
5)Sarvavelala Santruptini - Nerpinaavu Maakila Sakalanbunu
Cheyutaku - Saktinichchitivi Balaparachumu Ninnubatti Baludagu Devaa
|| Anu ||