Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 238 Old No: 68

జయశీలుడవగు ఓ మా

Jayasheeluda vagu O Maa

Open in Word & Worship App
తెలుగు   జయశీలుడవగు ఓ మా
పల్లవి
జయశీలుడవగు ఓ మా ప్రభువా జయగీతముల్‌ పాడెదమ్‌
1)
పాపంబుచేత పడిచెడిన మమ్ము కరుణించి రక్షించితివి
కృతజ్ఞతచే హృదయము నిండె స్తుతియింతుమో మా ప్రభు
|| జయ ||
2)
నీతియేలేని మా నీచ బ్రతుకుల్‌ నీయందు స్థిరమాయెను
ఉదయించెమాకై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతము
|| జయ ||
3)
అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యంబును
నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడ నొసగితివి
|| జయ ||
4)
శత్రుని ఉరిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి
భయభీతిలోన అభయంబునిచ్చి విడిపించితివి మా ప్రభో
|| జయ ||
5)
యుద్ధంబు నాది నిలుచుండి చూడుడి నేనిచ్చు రక్షణను
అని ప్రభు నీవు పోరాడితివి మా పక్షమందు నీవే
|| జయ ||
6)
క్రీస్తేసు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సాహముతో మమ్ము
ఊరేగించుచు మహిమ నొందుచున్న దేవా స్తోత్రములు
|| జయ ||
7)
పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరచు కొంటివి నీవు
విడువబడిన మమ్ము వివాహితగా జేసే హల్లెలూయ పాడెదము
|| జయ ||
English   Jayasheeluda vagu O Maa
Chorus
Jayaseeludavagu O Maa Prabhuvaa Jayageetamul Paadedam
1)
Paapanbucheta Padichedina Mammu Karuninchi Rakshinchitivi
Krutagnaatache Hrudayamu Ninde Sthuthiyintumo Maa Prabhu
|| Jaya ||
2)
Neetiyeleni Maa Neecha Bratukul Neeyandu Sthiramaayenu
Udayinchemaakai Neeti Sooryundu Mudamaara Pranutintamu
|| Jaya ||
3)
Avidheyatato Avivekulamai Kolpotimi Bhaagyanbunu
Nee Gnaana Ghanata Aisvaryamulanu Dayatoda Nosagitivi
|| Jaya ||
4)
Satruni Urilo Chikkina Maato Naa Sottu Meerantivi
Bhayabheetilona Abhayanbunichchi Vidipinchitivi Maa Prabho
|| Jaya ||
5)
Yudhanbu Naadi Niluchundi Choodudi Nenichchu Rakshananu
Ani Prabhu Neevu Poraaditivi Maa Pakshamandu Neeve
|| Jaya ||
6)
Kreestesu Prabhulo Pratisthalamandu Vijayotsaahamuto Mammu
Ooreginchuchu Mahima Nonduchunna Devaa Stotramulu
|| Jaya ||
7)
Paripoorna Krupato Nee Visvaasyatanu Kanuparachu Kontivi Neevu
Viduvabadina Mammu Vivaahitagaa Jese Hallelooya Paadedamu
|| Jaya ||
Present