Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 236 Old No: 66

స్తుతులు నీకర్పింతుము

Stutulu Neekarppintuamu

Open in Word & Worship App
తెలుగు   స్తుతులు నీకర్పింతుము
పల్లవి
స్తుతులు నీ కర్పింతుము - సతతము మా ప్రభువా!
సన్నుతించెదము - సన్నుతించెదము
1)
గడచినట్టి కాలము - కరుణతో నన్‌ గాచితివి
వెలలేనట్టి నీ కృప చూపినట్టి యేసువా
|| స్తుతులు ||
2)
నాదు దినములన్నిటన్‌ - నీదు క్షేమ మేలును
నీదు జాడలన్నియు - సారంబు నిచ్చున్‌
|| స్తుతులు ||
3)
నీదు మందిరంబులో - మేలుచేత మమ్మును
తృప్తిపరచిన ప్రభు - స్తుతులు నీకే చెల్లును
|| స్తుతులు ||
4)
నీదు నామ ఘనతను - నీదు ప్రేమ పనులను
నాథుడా! నే పాడెద - నాదు ప్రియ ప్రభువా
|| స్తుతులు ||
5)
సత్యరూపి నీవెగ - సకల సృష్టికర్తవు
సతతము మమ్మేలుము - హల్లెలూయ పాడెదం
|| స్తుతులు ||
English   Stutulu Neekarppintuamu
Chorus
Stutulu Nee Karpintumu - Satatamu Maa Prabhuvaa!
Sannutinchedamu - Sannutinchedamu
1)
Gadachinatti Kaalamu - Karunato Nan Gaachitivi
Velalenatti Nee Krupa Choopinatti Yesuvaa
|| Stutulu ||
2)
Naadu Dinamulannitan - Needu Kshema Melunu
Needu Jaadalanniyu - Saaranbu Nichchun
|| Stutulu ||
3)
Needu Mandiranbulo - Melucheta Mammunu
Truptiparachina Prabhu - Stutulu Neeke Chellunu
|| Stutulu ||
4)
Needu Naama Ghanatanu - Needu Prema Panulanu
Naathudaa! Ne Paadeda - Naadu Priya Prabhuvaa
|| Stutulu ||
5)
Satyaroopi Neevega - Sakala Srushtikartavu
Satatamu Mammelumu - Hallelooya Paadedan
|| Stutulu ||
Present