తెలుగు స్తోత్రించి కీర్తింతుము
పల్లవిస్తోత్రించి కీర్తంతుము ఘనపరచెదము - కొనియాడెదము
ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు
1)మనకింతవరకు సహాయపడె - తానప్పగించుకొనె మనకై
మనలను నడిపెను సుఖముగను తనదు సత్యము నేర్పించి
కనుపాపగ కాచె ఆ ఆ ఆ
|| స్తోత్రించి ||
2)ఈ ధరలోని నరులలో - యదార్థ హృదయులకు
ముదమున తన చిత్తము తెలుపున్ - పదిలముగ ప్రభుకన్నులు
పృధివిని పరుగెత్తున్ ఆ ఆ ఆ
|| స్తోత్రించి ||
3)అగ్నివంటి కన్నులు - విఘ్నముల నుండి విడిపించున్
తగిన సహాయము చేయును ఎక్కాలమందున కునుకవు
మక్కువ పిల్లలకు ఆ ఆ ఆ
|| స్తోత్రించి ||
4)హాగరును చూచిన కన్నులు - అనేకుల జూచెను
ఇశ్రాయేలును కనికరించె - ఎజ్రాకు సహాయపడె
నిద్రించవు నెపుడున్ ఆ ఆ ఆ
|| స్తోత్రించి ||
5)నీతిమంతులు జూచె - దాదివోలె గాచెను
జ్యోతుల వలె నుండును - అతి బలమిచ్చి అవసరతన్
క్షితి నిను విడువవు ఆ ఆ ఆ
|| స్తోత్రించి ||
English Stothrinchi Keerthintuamu
ChorusStotrinchi Keertantumu Ghanaparachedamu - Koniyaadedamu
Aadarinchi Kaapaaduvaadu Eederchuvaadu
1)Manakintavaraku Sahaayapade - Taanappaginchukone Manakai
Manalanu Nadipenu Sukhamuganu Tanadu Satyamu Nerpinchi
Kanupaapaga Kaache Aa Aa Aa
|| Stotrinchi ||
2)Ee Dharaloni Narulalo - Yadaartha Hrudayulaku
Mudamuna Tana Chittamu Telupun - Padilamuga Prabhukannulu
Prudhivini Parugettun Aa Aa Aa
|| Stotrinchi ||
3)Agnivanti Kannulu - Vighnamula Nundi Vidipinchun
Tagina Sahaayamu Cheyunu Ekkaalamanduna Kunukavu
Makkuva Pillalaku Aa Aa Aa
|| Stotrinchi ||
4)Haagarunu Choochina Kannulu - Anekula Joochenu
Israayelunu Kanikarinche - Ejraaku Sahaayapade
Nidrinchavu Nepudun Aa Aa Aa
|| Stotrinchi ||
5)Neetimantulu Jooche - Daadivole Gaachenu
Jyotula Vale Nundunu - Ati Balamichchi Avasaratan
Kshiti Ninu Viduvavu Aa Aa Aa
|| Stotrinchi ||