తెలుగు స్తోత్రం చెల్లింతుము
పల్లవిస్తోత్రం చెల్లింతుము స్తుతి - స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలుల తలచి
1)దివారాత్రములు - కంటిపాపవలె కాచి
దయగల హస్తముతో - బ్రోచి నడిపించితివి
|| స్తోత్రం ||
2)గాఢాంధకారములో - కన్నీటి లోయలలో
కృశించి - పోనీయక - కృపతో బలపరచితివి
|| స్తోత్రం ||
3)సజీవయాగముగా - మా శరీరము సమర్పించి
సంపూర్ణ సిద్ధినొంద - శుద్ధాత్మను నొసగితివి
|| స్తోత్రం ||
4)సీయోను మార్గములో - పలు శోధనలు రాగా
సాతాన్ని జయించుటకు - విశ్వాసము నిచ్చితివి
|| స్తోత్రం ||
5)సిలువను మోసికొని - సువార్తను చేపట్టి
యేసును వెంబడింప - ఎంత భాగ్యము నిచ్చితివి
|| స్తోత్రం ||
6)పాడెద హల్లెలూయా - మరనాత హల్లెలూయా
సద పాడెద హల్లెలూయా - ప్రభు యేసుకు హల్లెలూయా
|| స్తోత్రం ||
English Stothram Chellintuamu
ChorusStotran Chellintumu Sthuthi - Stotran Chellintumu
Yesu Naathuni Melula Talachi
1)Divaaraatramulu - Kantipaapavale Kaachi
Dayagala Hastamuto - Brochi Nadipinchitivi
|| Stotran ||
2)Gaadhaandhakaaramulo - Kanneeti Loyalalo
Krusinchi - Poneeyaka - Krupato Balaparachitivi
|| Stotran ||
3)Sajeevayaagamugaa - Maa Sareeramu Samarpinchi
Sanpoorna Siddhinonda - Sudhaatmanu Nosagitivi
|| Stotran ||
4)Seeyonu Maargamulo - Palu Sodhanalu Raagaa
Saataanni Jayinchutaku - Visvaasamu Nichchitivi
|| Stotran ||
5)Siluvanu Mosikoni - Suvaartanu Chepatti
Yesunu Venbadinpa - Enta Bhaagyamu Nichchitivi
|| Stotran ||
6)Paadeda Hallelooyaa - Maranaata Hallelooyaa
Sada Paadeda Hallelooyaa - Prabhu Yesuku Hallelooyaa
|| Stotran ||