Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 228 Old No: 630

తేనియ కంటెను యేసుని

Teeniya Kantenu Yesuni

Open in Word & Worship App
తెలుగు   తేనియ కంటెను యేసుని
పల్లవి
తేనియ కంటెను యేసుని నామము దివ్యమధుర మౌను
నీవు పరుగిడి రమ్ము దివ్య సన్నిధికి దినము ఓ మనసా
1)
లోకములోని కష్టములెల్ల యేసుడె భరియించెన్‌
పాపకీడును బాపెను - శాపము మాపెను తెలుసుకో ఓ మనసా
|| తెనీ ||
2)
పాపిని రక్షింప ప్రాణము నిచ్చెను యేక కుమారుండు
ఇది ఎంతటి కరుణ నిరంతరముండును తెలుసుకో ఓ మనసా
|| తెనీ ||
3)
అరుణోదయమున మంచువలె ఈ లోకము మాయమగున్‌
నీవు యేసుని నామము స్థిరమని నమ్మి హత్తుకొ ఓ మనసా
|| తెనీ ||
4)
కష్టములోనా సంతోషమియ్యును మిత్రుడే ఆ ప్రభువు
తన రెక్కల క్రింద ఆశ్రయ మిచ్చును నిశ్చయం ఓ మనసా
|| తెనీ ||
5)
భూలోకవాసులు పరలోక వాసులు ప్రభువును స్తుతియించుడి
యేసు నెరిగిన వారె పరమున జేరి స్తుతియించుదురో మనసా
|| తెనీ ||
English   Teeniya Kantenu Yesuni
Chorus
Teniya Kantenu Yesuni Naamamu Divyamadhura Maunu
Neevu Parugidi Rammu Divya Sannidhiki Dinamu O Manasaa
1)
Lokamuloni Kashtamulella Yesude Bhariyinchen
Paapakeedunu Baapenu - Saapamu Maapenu Telusuko O Manasaa
|| Tenee ||
2)
Paapini Rakshinpa Praanamu Nichchenu Yeka Kumaarundu
Idi Entati Karuna Nirantaramundunu Telusuko O Manasaa
|| Tenee ||
3)
Arunodayamuna Manchuvale Ee Lokamu Maayamagun
Neevu Yesuni Naamamu Sthiramani Nammi Hattuko O Manasaa
|| Tenee ||
4)
Kashtamulonaa Santoshamiyyunu Mitrude Aa Prabhuvu
Tana Rekkala Krinda Aasraya Michchunu Nischayan O Manasaa
|| Tenee ||
5)
Bhoolokavaasulu Paraloka Vaasulu Prabhuvunu Sthuthiyinchudi
Yesu Nerigina Vaare Paramuna Jeri Sthuthiyinchuduro Manasaa
|| Tenee ||
Present