తెలుగు మన యేసు దివ్యమైన
పల్లవిమనయేసు దివ్యమైన నామమున్ - స్మరియించిన ఎంతో ఆశీర్వాదం
1)పాపులనెంతో ప్రేమించిన నామం - పరమును వీడి వచ్చిన
నామం - ప్రాణము ప్రేమతో పెట్టిన నామం - పాపాత్ములనే
రక్షించుటకు ప్రేమతో పిలుచుచున్నట్టి నామం
|| మన ||
2)వెండిపసిడికన్న విలువైన నామం - విశ్వాసముంచిన విడిపించు
నామం - విజయము నిచ్చు వీరుని నామం - వెల్గులోనడుపు
బలమగు నామం - నిల్కడగా నిల్చు నిత్యుని నామం
|| మన ||
3)ఆశ్చర్యకరమైన మన యేసు నామం - అన్ని నామములకు
మిన్నైన నామం - అన్ని జీవులను పోషించునామం -
ఆపదలన్నిటిని బాపేనామం - అనవరతము స్తుతినొందేటి నామం
|| మన ||
4)దీనుల నాదరించెడి నామం - దివ్యసందేశము నిచ్చెడి నామం
దీక్షపరులుగాను చేసెడి నామం - దీనబంధువగు యేసుని నామం
దినదినము - రక్షించెడినామం
|| మన ||
5)దేవతలు దేవుళ్ళు ఎందరోవున్న - దేవాదిదేవుండు యేసు ప్రభుండే
ఏ నామమునను రక్షణలేదు - ఈ నామమున కలదు రక్షణ
నేడే నమ్ముము రక్షణ కలుగును
|| మన ||
English Mana Yesu Divyamaina
ChorusManayesu Divyamaina Naamamun - Smariyinchina Ento Aaseervaadam
1)Paapulanento Preminchina Naaman - Paramunu Veedi Vachchina
Naaman - Praanamu Premato Pettina Naaman - Paapaatmulane
Rakshinchutaku Premato Piluchuchunnatti Naaman
|| Mana ||
2)Vendipasidikanna Viluvaina Naaman - Visvaasamunchina Vidipinchu
Naaman - Vijayamu Nichchu Veeruni Naaman - Velgulonadupu
Balamagu Naaman - Nilkadagaa Nilchu Nityuni Naaman
|| Mana ||
3)Aascharyakaramaina Mana Yesu Naaman - Anni Naamamulaku
Minnaina Naaman - Anni Jeevulanu Poshinchunaaman -
Aapadalannitini Baapenaaman - Anavaratamu Sthuthinondeti Naaman
|| Mana ||
4)Deenula Naadarinchedi Naaman - Divyasandesamu Nichchedi Naamam
Deekshaparulugaanu Chesedi Naaman - Deenabandhuvagu Yesuni Naamam
Dinadinamu - Rakshinchedinaaman
|| Mana ||
5)Devatalu Devullu Endarovunna - Devaadidevundu Yesu Prabhunde
e Naamamunanu Rakshanaledu - Ee Naamamuna Kaladu Rakshana
Nede Nammumu Rakshana Kalugunu
|| Mana ||