Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 221 Old No: 143

మాప్రభో నీ నామము

Maaprabo Nee Naamamu

Open in Word & Worship App
తెలుగు   మాప్రభో నీ నామము
పల్లవి
మా ప్రభో - నీ నామము - మహోన్నతము
నిండె హృదయమందున నిలిచె సంఘమందున
1)
దూత గణము పరమున - సన్నుతించు నామము
లోకరక్షణార్థము - అవతరించిన నామము
వెలలేని నీ నామ ప్రభావమున్‌ - కల కాలము మేము
కీర్తింతుము - దేవాదిదేవా నిను కొనియాడెదం - ధరయందు
నీ నామం ప్రణుతింతుము ప్రకటింతుము
|| మా ప్రభో ||
2)
ఘోర పాపజనులకై ప్రాణమిచ్చిన నామము
మృతినిగెల్చి లేచిన - శక్తిగల్గిన నామము
మా హృదిని నీ కృపచే - వెలిగించితి - ఓ దేవ నీ పుణ్య
రక్తంబుచే - ఈ వార్త లోకాన చాటింతుము - యేసయ్యా
నీ కొరకే జీవింతుము - జయింతుము
|| మా ప్రభో ||
3)
దివ్యమైన నామము - దీవెనిచ్చెడి నామము
దీనమానవాళిని - దివికి జేర్చునామము
దినదినము నీ నామం - ధ్యానింతుము
అనుదినము నీ వార్త ప్రకటింతుము
పరమాత్ముడా నిన్ను పూజింతుము - జ్యోతిర్మయా నిన్ను
సేవింతుము - స్తోత్రింతుము
|| మా ప్రభో ||
English   Maaprabo Nee Naamamu
Chorus
Maa Prabho - Nee Naamamu - Mahonnatamu
Ninde Hrudayamanduna Niliche Sanghamanduna
1)
Doota Ganamu Paramuna - Sannutinchu Naamamu
Lokarakshanaarthamu - Avatarinchina Naamamu
Velaleni Nee Naama Prabhaavamun - Kala Kaalamu Memu
Keertintumu - Devaadidevaa Ninu Koniyaadedan - Dharayandu
Nee Naaman Pranutintumu Prakatintumu
|| Maa Prabho ||
2)
Ghora Paapajanulakai Praanamichchina Naamamu
Mrtinigelchi Lechina - Saktigalgina Naamamu
Maa Hrudini Nee Krupache - Veliginchiti - O Deva Nee Punya
Raktanbuche - Ee Vaarta Lokaana Chaatintumu - Yesayyaa
Nee Korake Jeevintumu - Jayintumu
|| Maa Prabho ||
3)
Divyamaina Naamamu - Deevenichchedi Naamamu
Deenamaanavaalini - Diviki Jerchunaamamu
Dinadinamu Nee Naaman - Dhyaanintumu
Anudinamu Nee Vaarta Prakatintumu
Paramaatmudaa Ninnu Poojintumu - Jyotirmayaa Ninnu
Sevintumu - Stotrintumu
|| Maa Prabho ||
Present