తెలుగు యేసు నీ నామామృతము
పల్లవియేసు నీ నామామృతము మా - కెంతో రుచియయ్యా
దేవ - మా దోసములను హరించి మోక్ష ని-వాసులుగ
జేయుటకు భాసుర ప్రకాశమైన
1)వేడుకలరగ గూడి నినుగొని - యాడు వారికి దేవ - ఎంతో
కీడుజేసిన పాడు వైరిని - గోడుగో డనంగ వాని తాడనము జేసితివి
|| యే ||
2)పాపములు హరింప నీవే - ప్రాపు మాకయ్యా - దేవా - నీ - దాపు
జేరిన వారికందరి - కాపదలు బాపి నిత్యకాపుగతి జూపినావు
|| యే ||
3)అక్షయ కరుణేక్షభువన - రక్షకా నీవే - దేవ - మమ్ము -
పక్షముగ రక్షించి మోక్షసు - రక్షణకు దీక్షగొని వీక్షితులమైన మాకు
|| యే ||
4)అందమగు నీ మందిరమున - బొందు-గా మేము దేవ నీ -
సుందర కరుణామృతము మా-డెందముల యందు గ్రోలు-
టందుకు సుందరమైన
|| యే ||
English Yesu Nee Naamamrtamu
ChorusYesu Nee Naamaamrtamu Maa - Kento Ruchiyayyaa
Deva - Maa Dosamulanu Harinchi Moksha Ni-Vaasuluga
Jeyutaku Bhaasura Prakaasamaina
1)Vedukalaraga Goodi Ninugoni - Yaadu Vaariki Deva - Ento
Keedujesina Paadu Vairini - Godugo Dananga Vaani Taadanamu Jesitivi
|| Ye ||
2)Paapamulu Harinpa Neeve - Praapu Maakayyaa - Devaa - Nee - Daapu
Jerina Vaarikandari - Kaapadalu Baapi Nityakaapugati Joopinaavu
|| Ye ||
3)Akshaya Karunekshabhuvana - Rakshakaa Neeve - Deva - Mammu -
Pakshamuga Rakshinchi Mokshasu - Rakshanaku Deekshagoni Veekshitulamaina
Maaku
|| Ye ||
4)Andamagu Nee Mandiramuna - Bondu-Gaa Memu Deva Nee -
Sundara Karunaamrtamu Maa-Dendamula Yandu Grolu-
Tanduku Sundaramaina
|| Ye ||