Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 217 Old No: 247

ఎవరు భాగ్యవంతులోడు

Evaru Bhaagyavantulodu

Open in Word & Worship App
తెలుగు   ఎవరు భాగ్యవంతులోడు
పల్లవి
ఎవరు భాగ్యవంతు లౌదు - రవని లోపల
మోక్ష - వివరమైన క్రీస్తుబోధ - చెవు లొగ్గి వినువారికన్న
1)
కవులు లాభ మరసి చేయు - కపట మంత్రముల్‌ - విధులు
దవులఁ బోవఁ దరిమి యేసు తత్వముఁ గొనువారికన్న
|| ఎ ||
2)
దీనమానసుల కిట్టి యుప - దేశ మిచ్చెను - దివ్య - మైన మోక్ష
రాజ్యము వారి దౌనటంచు - ప్రభువు తెల్పె
|| ఎ ||
3)
వృజినములకై దుఃఖించెడి - సుజను లెవ్వరో - వారు నిజముగ
నోదార్పుఁ బొంది నిత్య సంతోషితులని తెల్పె
|| ఎ ||
4)
శాంతి నీతి కరుణల యందా - సక్తి గలవారు - వారు నిజముగ
నోదార్పుఁ బొంది నిత్య సంతోషింతు లని తెల్పె
|| ఎ ||
5)
పరిశుద్ధ హృదయులు పరా - త్పరునిఁ జూతురు - సర్వ నరుల
సమాధానపరచు - నరులె పరమ జనకుని సుతులు
|| ఎ ||
6)
నీతికొర కాపద నొందెడి - నిశ్చలాత్ములు - వారు ఖ్యాతిగఁ
బరలోక రాజ్య - ఘన సౌఖ్యము లెల్లను బడయుదురు
|| ఎ ||
English   Evaru Bhaagyavantulodu
Chorus
Evaru Bhaagyavantu Laudu - Ravani Lopala
Moksha - Vivaramaina Kreestubodha - Chevu Loggi Vinuvaarikanna
1)
Kavulu Laabha Marasi Cheyu - Kapata Mantramul - Vidhulu
Davulan Bovan Darimi Yesu Tatvamun Gonuvaarikanna
|| E ||
2)
Deenamaanasula Kitti Yupa - Desa Michchenu - Divya - Maina Moksha
Raajyamu Vaari Daunatanchu - Prabhuvu Telpe
|| E ||
3)
Vrujinamulakai DuHkhinchedi - Sujanu Levvaro - Vaaru Nijamuga
Nodaarpun Bondi Nitya Santoshitulani Telpe
|| E ||
4)
Saanti Neeti Karunala Yandaa - Sakti Galavaaru - Vaaru Nijamuga
Nodaarpun Bondi Nitya Santoshintu Lani Telpe
|| E ||
5)
Parisudha Hrudayulu Paraa - Tparunin Jooturu - Sarva Narula
Samaadhaanaparachu - Narule Parama Janakuni Sutulu
|| E ||
6)
Neetikora Kaapada Nondedi - Nischalaatmulu - Vaaru KhyaatigaM
Baraloka Raajya - Ghana Saukhyamu Lellanu Badayuduru
|| E ||
Present