Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 214 Old No: 707

బలవంతుడగు ఓ దేవా

Balavantudagu O Devaa

Open in Word & Worship App
తెలుగు   బలవంతుడగు ఓ దేవా
పల్లవి
బలవంతుడగు ఓ దేవా - ఆలోచన కర్త యేసూ
బలహీనుల మగు మమ్ము - బలపరచుము నీ కృపతో
1)
నీ యందు నమ్మిక యుంచిన - విశ్వాసుల తండ్రి అబ్రహాం
వృద్ధాప్యమందు కూడా - బలహీనత లేక యుండె
విశ్వాసము వలన బలముతో - వాగ్దాన ఫలము నొందె
2)
ప్రార్థన చేసిన పౌలు - బలమొందె నిను సేవింప
సంసోను బలమునొంది - సంహరించె శత్రుమూకను
ప్రార్థన శక్తితోడ - స్థిరపరచి మము బలపరచు
3)
ఏండ్లు ఎనభై నిండిన - బలహీనుడు కాలేదు కాలేబు
నిండు మనసుతో సేవింపగ - నిండెనతుడు శక్తితో
నీకై యుద్ధము సేయ - బలపరచుము కాలేబు వలెను
4)
నీ యందు ఆనందించిన - బలము కలుగును మాకు
యధార్థ హృదయములను - బలపరచేది నీ దృష్టి
నీ కొరకెదురు చూచిన - బలపరతువు పక్షి రాజువలె
5)
పరిశుద్ధాత్మ బలము - పరిశుద్ధ వాక్యబలముకై
ఐకమత్యమే బలము - ప్రేమలో కలదు బలము
భక్తి యందె బలము - ముక్తి దాత నీవే బలము
English   Balavantudagu O Devaa
Chorus
Balavantudagu O Devaa - Aalochana Karta Yesoo
Balaheenula Magu Mammu - Balaparachumu Nee Krupato
1)
Nee Yandu Nammika Yunchina - Visvaasula Tandri Abrahaam
Vrudhaapyamandu Koodaa - Balaheenata Leka Yunde
Visvaasamu Valana Balamuto - Vaagdaana Phalamu Nonde
2)
Praarthana Chesina Paulu - Balamonde Ninu Sevinpa
Sansonu Balamunondi - Sanharinche Satrumookanu
Praarthana Saktitoda - Sthiraparachi Mamu Balaparachu
3)
endlu Enabhai Nindina - Balaheenudu Kaaledu Kaalebu
Nindu Manasuto Sevinpaga - Nindenatudu Saktito
Neekai Yudhamu Seya - Balaparachumu Kaalebu Valenu
4)
Nee Yandu Aanandinchina - Balamu Kalugunu Maaku
Yadhaartha Hrudayamulanu - Balaparachedi Nee Drushti
Nee Korakeduru Choochina - Balaparatuvu Pakshi Raajuvale
5)
Parisudhaatma Balamu - Parisudha Vaakyabalamukai
Aikamatyame Balamu - Premalo Kaladu Balamu
Bhakti Yande Balamu - Mukti Daata Neeve Balamu
Present