Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 211

యెహోవా నీవు నన్ను

Yehova Neevu Nannu

Open in Word & Worship App
తెలుగు   యెహోవా నీవు నన్ను
పల్లవి
యెహోవా - నీవు నన్ను పరిశీలించి తెలిసికొంటివి
నే కూర్చుండుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు
1)
పరిశీలించియున్నావు నీవు నా నడక పడకలను
నా చర్యలన్నిటిని బాగుగా నీవు యెరిగియున్నావు
|| యెహోవా ||
2)
యెహోవా మాట నా నాలుకకు రాక - మునుపే యెరుగుదువు
ముందు వెనుకల నన్నావరించి నీ చేతిని నాపై నుంచితివి
|| యెహోవా ||
3)
నాకు బహు మించియున్నదిట్టి తెలివి - నా కగోచరము
నీ యాత్మను నీ సన్నిధిని విడిచి యెచ్చటికి - పారిపోవుదును
|| యెహోవా ||
4)
నే నాకాశమున కెక్కినప్పటికిని నీ - వచ్చట నున్నావు
పాతాళమందు పండుకొనినను - నీవు అచ్చట నున్నావు
|| యెహోవా ||
5)
సముద్ర దిగంతములలో నేను వేకువ - రెక్కలు కట్టుకొని
వసించిన నీదు హస్తము పట్టుకొని - నన్ను నడిపించున్‌
|| యెహోవా ||
English   Yehova Neevu Nannu
Chorus
Yehovaa - Neevu Nannu Pariseelinchi Telisikontivi
Ne Koorchundutayu Lechuta Neeku Teliyunu Talanpu Neruguduvu
1)
Pariseelinchiyunnaavu Neevu Naa Nadaka Padakalanu
Naa Charyalannitini Baagugaa Neevu Yerigiyunnaavu
|| Yehovaa ||
2)
Yehovaa Maata Naa Naalukaku Raaka - Munupe Yeruguduvu
Mundu Venukala Nannaavarinchi Nee Chetini Naapai Nunchitivi
|| Yehovaa ||
3)
Naaku Bahu Minchiyunnaditti Telivi - Naa Kagocharamu
Nee Yaatmanu Nee Sannidhini Vidichi Yechchatiki - Paaripovudunu
|| Yehovaa ||
4)
Ne Naakaasamuna Kekkinappatikini Nee - Vachchata Nunnaavu
Paataalamandu Pandukoninanu - Neevu Achchata Nunnaavu
|| Yehovaa ||
5)
Samudra Digantamulalo Nenu Vekuva - Rekkalu Kattukoni
Vasinchina Needu Hastamu Pattukoni - Nannu Nadipinchun
|| Yehovaa ||
Present