తెలుగు మొదటివాడా! కడపటివాడా!
పల్లవిమొదటివాడా! కడపటివాడా! మృతిని గెల్చిన యుగముల వాడా!
నిన్న నేడు నీ వొకటే రీతిగ వున్నవాడవు ఉండబోదువు
1)ఆదియంతముల్ లేనివాడా! భూమ్యాకాశముల్ చేసిన ఘనుడా!
సృష్టికర్తవు స్థితిలయ కర్తవు - సర్వశక్తుడా! సర్వజ్ఞుండా!
|| మొ ||
2)పాపుల రక్షణ కర్తవు నీవే - ఇహపరములలో ఏలిక నీవే
శాంతి దాంతులకు నిలయము నీవే - శాశ్వతమౌ ఆనందము నీవే
|| మొ ||
3)సంఘ వధువునకు శిరస్సు నీవే - సంఘ రక్షణకు కర్తవు నీవే
నింగి నేలను మించిన ప్రేమచే - రక్తము కార్చిన రక్షకుండవు
|| మొ ||
English Modativadaa! Kadapativadaa!
ChorusModativaadaa! Kadapativaadaa! Mrtini Gelchina Yugamula Vaadaa!
A.Pa: Ninna Nedu Nee Vokate Reetiga Vunnavaadavu Undaboduvu
1)Aadiyantamul Lenivaadaa! Bhoomyaakaasamul Chesina Ghanudaa!
Srushtikartavu Sthitilaya Kartavu - Sarvasaktudaa! Sarvagnaundaa!
|| Mo ||
2)Paapula Rakshana Kartavu Neeve - Ihaparamulalo elika Neeve
Saanti Daantulaku Nilayamu Neeve - Saasvatamau Aanandamu Neeve
|| Mo ||
3)Sangha Vadhuvunaku Sirassu Neeve - Sangha Rakshanaku Kartavu Neeve
Ningi Nelanu Minchina Premache - Raktamu Kaarchina Rakshakundavu
|| Mo ||