Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 205

సర్వసృష్టి నిర్మాణకుడా - సర్వ శక్తిమంతుడా

Sarvasrushti Nirmaanakudaa - Sarva Shaktimantudaa

Open in Word & Worship App
తెలుగు   సర్వసృష్టి నిర్మాణకుడా - సర్వ శక్తిమంతుడా
పల్లవి
సర్వసృష్టి నిర్మాణకుడా - సర్వశక్తిమంతుడా
సకల జీవుల స్తోత్రపాత్రుడా - సతతము స్తుతియింతుము
1)
ఆశ్చర్యకరుడు యేసు - ఆలోచన కర్తయును
బలవంతుడైన దేవుడు - నిత్యుడగు తండ్రియును
మా పాపము బాపుటకు - మనుజ రూపము దాల్చిన దేవా
|| సర్వ ||
2)
పరిశుద్ధుడు నిత్యనివాసి - మహోన్నతుడైన దేవుడు
పరలోకములో వసించుచు - అమరత్వము గలవాడు
మానవులను రక్షించుటకు - మరణించి తిరిగి లేచిన
|| సర్వ ||
3)
శ్రీమంతుడు అద్వితీయుడు - సర్వాధికారియును
రాజులకు రారాజు - దేవతలకు దేవుండు
దాసుని స్వరూపము దాల్చి - దీనులను బ్రోచితివి
|| సర్వ ||
English   Sarvasrushti Nirmaanakudaa - Sarva Shaktimantudaa
Chorus
Sarvasrushti Nirmaanakudaa - Sarvasaktimantudaa
Sakala Jeevula Stotrapaatrudaa - Satatamu Sthuthiyintumu
1)
Aascharyakarudu Yesu - Aalochana Kartayunu
Balavantudaina Devudu - Nityudagu Tandriyunu
Maa Paapamu Baaputaku - Manuja Roopamu Daalchina Devaa
|| Sarva ||
2)
Parisuddhudu Nityanivaasi - Mahonnatudaina Devudu
Paralokamulo Vasinchuchu - Amaratvamu Galavaadu
Maanavulanu Rakshinchutaku - Maraninchi Tirigi Lechina
|| Sarva ||
3)
Sreemantudu Adviteeyudu - Sarvaadhikaariyunu
Raajulaku Raaraaju - Devatalaku Devundu
Daasuni Svaroopamu Daalchi - Deenulanu Brochitivi
|| Sarva ||
Present