తెలుగు దేవా! దేవా! దేవా!
పల్లవిదేవా! దేవా! దేవా! నీ-సింహాసనము నిరంతరము నిలుచున్
నీ రాజ్యదండము న్యాయార్థమైనది
1)నీతిని ప్రేమించితివి - దుర్నీతిని ద్వేషించితివి - అందుచేత దేవుడు
నీ దేవుడు - ఆనంద తైలముతో అభిషేకించెను నిను హెచ్చరించెను
|| దేవా ||
2)ప్రభువా! ప్రభువా! ప్రభువా! నీవేగదా సృష్టించితివి పుడమిన్
ఆకాశములును నీ హస్తకృత్యములే - అవి యన్నియు నశియించును
శాశ్వతముగ నుందువు నీవు అవి పాతగిలు వస్త్రముల వలె
వాటిని మార్చెదవు మడచివేతువు మరుగు చేతువు
|| దేవా ||
3)యేసూ! క్రీస్తూ! యేసూ! నీ నామమున్ స్తుతిగానము చేతున్
సమాజములలో చాటించి కీర్తింతున్ - నిను ఏ మాత్రము విడువను
నిను ఎన్నడును ఎడబాయన్ - అని చేసితివి వాగ్ధానముల్
నేనేమి భయపడను - ధైర్యంబుతో ధరన్ జీవించెదన్
|| దేవా ||
English Devaa! Devaa! Devaa!
ChorusDevaa! Devaa! Devaa! Nee-Sinhaasanamu Nirantaramu Niluchun
Nee Raajyadandamu Nyaayaarthamainadi
1)Neetini Preminchitivi - Durneetini Dveshinchitivi - Anducheta Devudu
Nee Devudu - Aananda Tailamuto Abhishekinchenu Ninu Hechcharinchenu
|| Devaa ||
2)Prabhuvaa! Prabhuvaa! Prabhuvaa! Neevegadaa Srushtinchitivi Pudamin
Aakaasamulunu Nee Hastakrutyamule - Avi Yanniyu Nasiyinchunu
Saasvatamuga Nunduvu Neevu Avi Paatagilu Vastramula Vale
Vaatini Maarchedavu Madachivetuvu Marugu Chetuvu
|| Devaa ||
3)Yesoo! Kreestoo! Yesoo! Nee Naamamun Sthuthigaanamu Chetun
Samaajamulalo Chaatinchi Keertintun - Ninu e Maatramu Viduvanu
Ninu Ennadunu Edabaayan - Ani Chesitivi Vaagdhaanamul
Nenemi Bhayapadanu - Dhairyanbuto Dharan Jeevinchedan
|| Devaa ||