తెలుగు ఉత్సహించు పెదవులతో
పల్లవిఉత్సహించు పెదవులతో - ఉత్సాహగానము చేతును
జీవిత కాలమంతయు -ఈలాగే స్తుతియింతును
1)నాశనకరమగు గుంటలో నుండి - యేసుడు నను లేపెను
స్తోత్రరూప గీతమున్ - విచిత్రముగ నాకొసగెను
|| ఉ ||
2)పెదవులు మూసికొనక - మహాసమాజములో కీర్తింతును
ప్రభుయేసు కృపలను - ప్రకటింతును ప్రజలందరకు
|| ఉ ||
3)ధాన్య ద్రాక్షారసములు - విస్తరించిన వారికన్నా
అధిక సంతస గీతము నానోట - ఆ ప్రభువుంచెను
|| ఉ ||
4)ఆపత్కాల మందున తన - పర్ణశాలలో దాచును
ఆశ్రయ దుర్గముపైన వుంచి - ఆనంద గీతము నొసగును
|| ఉ ||
5)రక్షణ భాగ్యము నొసగిన - రక్షణ దుర్గంబును బట్టి
కృతజ్ఞతాస్తుతులతో - క్రొత్త గీతము పాడెదను
|| ఉ ||
English Utsahimchu Pedavulato
ChorusUtsahinchu Pedavulato - Utsaahagaanamu Chetunu
Jeevita Kaalamantayu -Eelaage Sthuthiyintunu
1)Naasanakaramagu Guntalo Nundi - Yesudu Nanu Lepenu
Stotraroopa Geetamun - Vichitramuga Naakosagenu
|| U ||
2)Pedavulu Moosikonaka - Mahaasamaajamulo Keertintunu
Prabhuyesu Krupalanu - Prakatintunu Prajalandaraku
|| U ||
3)Dhaanya Draakshaarasamulu - Vistarinchina Vaarikannaa
Adhika Santasa Geetamu Naanota - Aa Prabhuvunchenu
|| U ||
4)Aapatkaala Manduna Tana - Parnasaalalo Daachunu
Aasraya Durgamupaina Vunchi - Aananda Geetamu Nosagunu
|| U ||
5)Rakshana Bhaagyamu Nosagina - Rakshana Durganbunu Batti
Krutagnaataastutulato - Krotta Geetamu Paadedanu
|| U ||