Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 2

స్తుతియు మహిమ ఘనత

Sthuthiyu Mahima Ghanata

♪ సీయోను గీతములు♪ Songs of Zion
Open in Word & Worship App
తెలుగు   స్తుతియు మహిమ ఘనత
పల్లవి
స్తుతియు మహిమ ఘనత నీకే - యుగయుగముల వరకు
ఎంతో ...... నమ్మదగిన దేవా - ఎంతో... నమ్మదగిన దేవా
1)
మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము
మేమందరము ఉత్సాహించి సంతోషించెదము
కొనియాడెదము మరువబడని మేలుల జేసెనని
|| స్తుతియు ||
2)
నీ ఒక్కడవే గొప్పదేవుడవు ఘనకార్యములు జేయుదువు
నీదు కృపయే నిరంతరము నిలిచి యుండునుగా
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము
|| స్తుతియు ||
3)
నూతనముగ దినదినము నిలుచు నీదు వాత్సల్యతమాపై
ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెద మెప్పుడు
ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా
|| స్తుతియు ||
4)
నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి
జీవము నిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా
సేవించెదము సమ భూమి గల ప్రదేశములో నిన్ను
|| స్తుతియు ||
5)
భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్ని మా కొరకు
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్
పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము
|| స్తుతియు ||
English   Sthuthiyu Mahima Ghanata
Chorus
Sthuthiyu Mahima Ghanata Neeke - Yugayugamula Varaku
Ento ...... Nammadagina Devaa - Ento... Nammadagina Devaa
1)
Maa Devudavai Maakichchitivi Ento Goppa Subhadinamu
Memandaramu Utsaahinchi Santoshinchedamu
Koniyaadedamu Maruvabadani Melula Jesenani
|| Sthuthiyu ||
2)
Nee Okkadave Goppadevudavu Ghanakaaryamulu Jeyuduvu
Needu Krupaye Nirantaramu Nilichi Yundunugaa
Ninnu Memu Aanandamuto Aaraadhinchedamu
|| Sthuthiyu ||
3)
Nootanamuga Dinadinamu Niluchu Needu Vaatsalyatamaapai
Khyaatigaa Niliche Nee Naamamunu Keertincheda Meppudu
Preetito Maa Stutularpinchedamu Daakshinya Prabhuvaa
|| Sthuthiyu ||
4)
Neeve Maaku Parama Prabhudavai Nee Chittamu Neraverchitivi
Jeevamu Nichchi Nadipinchedavu Nee Aatma Dvaaraa
Sevinchedamu Sama Bhoomi Gala Pradesamulo Ninnu
|| Sthuthiyu ||
5)
Bhariyinchitivi Sramalu Nindalu Orchitivanni Maa Koraku
Maranamu Gelchi Odinchitivi Saataanu Balamun
Paramu Nundi Maakai Vachche Prabhu Yesu Jayamu
|| Sthuthiyu ||
Present