తెలుగు దివ్య తేజ నీతి రాజ నిను
పల్లవిదివ్య తేజ నీతిరాజా - నిను వర్ణింప నా తరమా - మహిమ ప్రభావా !
1)ఉన్నతమైన సింహాసనమున - మహిమలో నిలిచిన దేవా!
ఏమని వర్ణింతు నీదు మహిమను - నీ కీర్తిని నే పొగడెదను
|| దివ్య ||
2)దూతల మధ్యను జీవుల మధ్యను - స్తుతినొందెడి దేవా! నీదు
కృపను నే పాడెద ప్రభువా - ఘన పరతును నిరతం
|| దివ్య ||
3)దూతలు పాడిరి గొప్ప స్వరముతో! పరిశుద్ధుడు పరిశుద్ధుడ ని
మహిమతో నిండెను సర్వలోకమని - ప్రతి గానములు చేసిరిగా
|| దివ్య ||
4)పదివేలలో అతిసుందరుడవుగా - బహు ప్రియుడవు నీవే -
శిరము ధవళము - స్వరము మధురము - నీ ప్రేమ అతి మధురం
|| దివ్య ||
5)నిను వర్ణింపను నే జాలనయ - అపవిత్రుడనో ప్రభువా
పరిశుద్ధునిగా చేయుము ప్రభువా - స్తుతియింతును - నిను
నిరతము దేవా
|| దివ్య ||
English Divya Teja Neethi Raaja Ninu
ChorusDivya Teja Neetiraajaa - Ninu Varninpa Naa Taramaa - Mahima Prabhaavaa !
1)Unnatamaina Sinhaasanamuna - Mahimalo Nilichina Devaa!
emani Varnintu Needu Mahimanu - Nee Keertini Ne Pogadedanu
|| Divya ||
2)Dootala Madhyanu Jeevula Madhyanu - Sthuthinondedi Devaa! Needu
Krupanu Ne Paadeda Prabhuvaa - Ghana Paratunu Niratan
|| Divya ||
3)Dootalu Paadiri Goppa Svaramuto! Parisuddhudu Parisuddhuda Ni
Mahimato Nindenu Sarvalokamani - Prati Gaanamulu Chesirigaa
|| Divya ||
4)Padivelalo Atisundarudavugaa - Bahu Priyudavu Neeve -
Siramu Dhavalamu - Svaramu Madhuramu - Nee Prema Ati Madhuran
|| Divya ||
5)Ninu Varninpanu Ne Jaalanaya - Apavitrudano Prabhuvaa
Parisuddhunigaa Cheyumu Prabhuvaa - Sthuthiyintunu - Ninu
Niratamu Devaa
|| Divya ||