Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 195

లేచినాడురా సమాది

Lechinaaduraa Samaadi

Open in Word & Worship App
తెలుగు   లేచినాడురా సమాది
పల్లవి
లేచినాడురా సమాధి గెలిచినాడురా - యేసు
లేచినాడురా సమాధి గెలిచినాడురా
లేతునని తా జెప్పినట్లు - లేఖనములలో బలికినట్లు
1)
భద్రముగా సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు
ముద్రవేసి రాత్రియంత - నిద్రలేక కావలియున్న
|| లేచి ||
2)
ప్రభువుదూత పరమునుండి - త్వరగ దిగి రాతిని పొర్లించి
1భళిర దాని పై కూర్చుండె - భయము నొంద కావలివారు
|| లేచి ||
3)
ప్రొద్దుపొడవక ముందే స్త్రీలు - సిద్ధపరచిన సుగంధములను
శ్రద్ధతోడ దెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చి చూడ
|| లేచి ||
4)
చూడ వెళ్ళిన స్త్రీలను దూత - చూచియపుడే వారితోడ
లేడు ప్రభువు లేచినాడు - గలిలయ వెళ్ళుచున్నాడనెను
|| లేచి ||
5)
చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు
చచ్చినను నను లేపుతాడు - చావు అంటే భయపడరాదు
|| లేచి ||
6)
నేను చేసే పనుల నెరుగు - నేను నడిచే మార్గమెరుగు
నేను చెప్పుమాట లెరుగు - నేను బ్రతికే బతుకు నెరుగు
|| లేచి ||
7)
నేను లేచిన యేసునందు - మానక మది నమ్ముకొందు
తాను నాలో యుండినందున - దయను జేర్చును మోక్షమందు
|| లేచి ||
8)
పాపభారము లేదు మనకు - మరణ భయము లేదు మనకు
నరక బాధ లేదు మనకు - మరువకండి యేసు ప్రభువును
|| లేచి ||
9)
పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించినాడు
పాపులను ప్రేమించినాడు - ప్రాణ దానము చేసినాడు
|| లేచి ||
10)
యేసునందే రక్షణ భాగ్యం - యేసునందే నిత్యజీవం
యేసునందే ఆత్మశాంతి - యేసునందే మోక్షభాగ్యం
1 భళా అన్నట్లు
|| లేచి ||
English   Lechinaaduraa Samaadi
Chorus
Lechinaaduraa Samaadhi Gelichinaaduraa - Yesu
Lechinaaduraa Samaadhi Gelichinaaduraa
Letunani Taa Jeppinatlu - Lekhanamulalo Balikinatlu
1)
Bhadramugaa Samaadhipaini - Peddaraatini Yunchiri Bhatulu
Mudravesi Raatriyanta - Nidraleka Kaavaliyunna
|| Lechi ||
2)
Prabhuvudoota Paramunundi - Tvaraga Digi Raatini Porlinchi
Bhalira Daani Pai Koorchunde - Bhayamu Nonda Kaavalivaaru
|| Lechi ||
3)
Proddupodavaka Munde Streelu - Sidhaparachina Sugandhamulanu
Sradhatoda Dechchi Yesuku - Ruddudaamani Vachchi Chooda
|| Lechi ||
4)
Chooda Vellina Streelanu Doota - Choochiyapude Vaaritoda
Ledu Prabhuvu Lechinaadu - Galilaya Velluchunnaadanenu
|| Lechi ||
5)
Chachchipoyi Lechinaadu - Svaami Bhaktula Kagupadinaadu
Chachchinanu Nanu Leputaadu - Chaavu Ante Bhayapadaraadu
|| Lechi ||
6)
Nenu Chese Panula Nerugu - Nenu Nadiche Maargamerugu
Nenu Cheppumaata Lerugu - Nenu Bratike Batuku Nerugu
|| Lechi ||
7)
Nenu Lechina Yesunandu - Maanaka Madi Nammukondu
Taanu Naalo Yundinanduna - Dayanu Jerchunu Mokshamandu
|| Lechi ||
8)
Paapabhaaramu Ledu Manaku - Marana Bhayamu Ledu Manaku
Naraka Baadha Ledu Manaku - Maruvakandi Yesu Prabhuvunu
|| Lechi ||
9)
Paapulakai Vachchinaadu - Paapulanu Karuninchinaadu
Paapulanu Preminchinaadu - Praana Daanamu Chesinaadu
|| Lechi ||
10)
Yesunande Rakshana Bhaagyan - Yesunande Nityajeevam
Yesunande Aatmasaanti - Yesunande Mokshabhaagyan
|| Lechi ||
Present