Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 194

వినరే యో నరులారా

Vinare Yo Narulaaraa

Open in Word & Worship App
తెలుగు   వినరే యో నరులారా
పల్లవి
వినరే యో నరులారా - వీనుల కింపు మీర - మనల రక్షింప క్రీస్తు-
మనుజావతారుఁ డయ్యె - వినరే - అనుదినమును దే - వుని
తనయుని పద వనజంబులు మన - మున నిడికొనుచును
1)
నరరూపుఁ బూని ఘోర-నరకుల రారమ్మని-దురితముఁ బాపు
దొడ్డ-దొరయౌ మరియా వరపుత్రుడు - కర మరుదగు క-ల్వరి
గిరి దరి కరి-గి రయంబున ప్రభు-కరుణను గనరే
|| వినరే ||
2)
ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్షఁ-బూని తనమేని సిలువ-
మ్రాను నణఁచి మృతిఁ బొందెను-దీన దయా పరుఁ - డైన మహాత్ముఁడు
జానుగ - యాగము సలిపిన తెరంగిది
|| వినరే ||
3)
పొందుఁగోరిన వారి - విందా పరమోపకారి - యెంద రెందరిఁ
బరమా - నందపద మొందఁగఁ జేసెను-అందమునన్‌ దన-బొంది
సురక్తము-జిందెను భక్తుల-డెందము గుందఁగ
|| వినరే ||
4)
ఇల మాయావాదుల మాని - యితఁడే సద్గురు డని - తలపోసి చూచి
మది ని-శ్చల భక్తిని గొలిచిన వారికి-నిల జనులకు గలు-ములనెలరెడు
ధని-కుల కందని సుఖ-ములు మరి యొసఁగును
|| వినరే ||
5)
దురితము లణఁప వచ్చి-మరణమై తిరిగి లేచి-నిరత మోక్షానంద
సుం-దర మందిరమున కరుదుగఁ జనె-బిరబిర మన మం-దర మా
కరుణా - శరనిధి చరణ మె-శరణని పోదము
|| వినరే ||
English   Vinare Yo Narulaaraa
Chorus
Vinare Yo Narulaaraa - Veenula Kinpu Meera - Manala Rakshinpa Kreestu-
Manujaavataarun Dayye - Vinare - Anudinamunu De - Vuni
Tanayuni Pada Vanajanbulu Mana - Muna Nidikonuchunu
1)
Nararoopun Booni Ghora-Narakula Raarammani-Duritamun Baapu
Dodda-Dorayau Mariyaa Varaputrudu - Kara Marudagu Ka-Lvari
Giri Dari Kari-Gi Rayanbuna Prabhu-Karunanu Ganare
|| Vinare ||
2)
Aanandamaina Moksha-Mandari Kiyya Deekshan-Booni Tanameni Siluva-
Mraanu Nananchi Mrtin Bondenu-Deena Dayaa Parun - Daina Mahaatmundu
Jaanuga - Yaagamu Salipina Terangidi
|| Vinare ||
3)
Pondungorina Vaari - Vindaa Paramopakaari - Yenda RendariM
Baramaa - Nandapada Mondangan Jesenu-Andamunan Dana-Bondi
Suraktamu-Jindenu Bhaktula-Dendamu Gundanga
|| Vinare ||
4)
Ila Maayaavaadula Maani - Yitande Sadguru Dani - Talaposi Choochi
Madi Ni-Schala Bhaktini Golichina Vaariki-Nila Janulaku
Galu-Mulanelaredu
Dhani-Kula Kandani Sukha-Mulu Mari Yosangunu
|| Vinare ||
5)
Duritamu Lananpa Vachchi-Maranamai Tirigi Lechi-Nirata Mokshaananda
Sun-Dara Mandiramuna Karudugan Jane-Birabira Mana Man-Dara Maa
Karunaa - Saranidhi Charana Me-Saranani Podamu
|| Vinare ||
Present