Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 192 Old No: 121

కొనియాడతరమే నిన్ను

Koniyaadatarame Ninnu

Open in Word & Worship App
తెలుగు   కొనియాడతరమే నిన్ను
పల్లవి
కొనియాడతరమే నిన్ను - కోమల హృదయ కొనియాడ
దరమె నిన్ను - తనరారు దినకర బెనుతారలను మించు
ఘనతేజమున నొప్పు - కాంతిమంతుడు నీవు
1)
కెరూబూలు సెరాపులు - మరి దూతగణములు
నురుతరంబుగ గొలువ - నొప్పు శ్రేష్ఠుండ నీవు
|| కొనియా ||
2)
సర్వలోకంబుల - బర్వు దేవుడ వయ్యు
నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితి నీవు
|| కొనియా ||
3)
విశ్వమంతయు నేలు - వీరాసనుండ వయ్యు
పశ్వాళితో దిట్టి పండియుంటివి నీవు
|| కొనియా ||
4)
దోసంబులను మడియు దాసాళి గరుణించి
యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు
|| కొనియా ||
5)
నరులయందున గరుణ - ధర సమాధానంబు
చిరకాలమును మహిమ పరంగ జేయుదు నీవు
|| కొనియా ||
6)
ఓ యేసు పాన్పుగ - నా యాత్మం జేకొని
శ్రేయముగ బవళించు శ్రీకర వరసుత
|| కొనియా ||
English   Koniyaadatarame Ninnu
Chorus
Koniyaadatarame Ninnu - Komala Hrudaya Koniyaada
Darame Ninnu - Tanaraaru Dinakara Benutaaralanu Minchu
Ghanatejamuna Noppu - Kaantimantudu Neevu
1)
Kerooboolu Seraapulu - Mari Dootaganamulu
Nurutaranbuga Goluva - Noppu Sreshthunda Neevu
|| Koniyaa ||
2)
Sarvalokanbula - Barvu Devuda Vayyu
Nurvi Stree Garbhaana Nudbhavinchiti Neevu
|| Koniyaa ||
3)
Visvamantayu Nelu - Veeraasanunda Vayyu
Pasvaalito Ditti Pandiyuntivi Neevu
|| Koniyaa ||
4)
Dosanbulanu Madiyu Daasaali Garuninchi
Yesu Peruna Jagati Kegudenchiti Neevu
|| Koniyaa ||
5)
Narulayanduna Garuna - Dhara Samaadhaananbu
Chirakaalamunu Mahima Paranga Jeyudu Neevu
|| Koniyaa ||
6)
O Yesu Paanpuga - Naa Yaatman Jekoni
Sreyamuga Bavalinchu Sreekara Varasuta
|| Koniyaa ||
Present