Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 191

అర్పణలు అర్పించుడి

Arpanalu Arpincudi

Open in Word & Worship App
తెలుగు   అర్పణలు అర్పించుడి
పల్లవి
అర్పణలు అర్పించుడీ మీరు ఆశీర్వాదము లొందుడీ!
అర్పణలు అర్పించి పితరుడు అబ్రహాము దీవెనొందెను
1)
ఇహపరాలలో సుఖము గోరితే - ఇలలో తలగా నుండగోరితే
ఇచ్చిన దానికి నూరంతలుగా - ఇహపరాలలో ధనము గోరితే
|| అ ||
2)
అన్నిటను అభివృద్ధి గోరితే - ఆయువును ఆరోగ్యమడిగితే
నిజము దేవుని పొందుగోరితే - నిత్య సంతోషంబు గోరితే
|| అ ||
3)
ప్రతిపంటలో ప్రధమ ఫలములు - ప్రభునీయగ మనసు రాదా?
దశమభాగము తీయకుంటే - ధన్యతను మరి పొందగలమా!
|| అ ||
4)
ఆషామాషీ అర్పణలతో - కయీనయ్య శాపమొందెను
అననీయ - సప్పీరాలు - నీముదాచిరి మరణమొందిరి
|| అ ||
5)
పిసినిగొట్టుకు చీడపీడలు - అన్ని తరాలకు అంటివచ్చును
కీడు విత్తి మేలు కోతువా - ముండ్ల కంచెలో పండ్లు దొరుకునా
|| అ ||
6)
దేవుడిచ్చిన పాడిపంటలు - దండిగా ఆశించుచుందువు
దశమభాగముతీయ వెరతువు - దైవ కార్యములెట్లు జరుగును
|| అ ||
English   Arpanalu Arpincudi
Chorus
Arpanalu Arpinchudee Meeru Aaseervaadamu Londudee!
Arpanalu Arpinchi Pitarudu Abrahaamu Deevenondenu
1)
Ihaparaalalo Sukhamu Gorite - Ilalo Talagaa Nundagorite
Ichchina Daaniki Noorantalugaa - Ihaparaalalo Dhanamu Gorite
|| A ||
2)
Annitanu Abhivruddhi Gorite - Aayuvunu Aarogyamadigite
Nijamu Devuni Pondugorite - Nitya Santoshanbu Gorite
|| A ||
3)
Pratipantalo Pradhama Phalamulu - Prabhuneeyaga Manasu Raadaa?
Dasamabhaagamu Teeyakunte - Dhanyatanu Mari Pondagalamaa!
|| A ||
4)
Aashaamaashee Arpanalato - Kayeenayya Saapamondenu
Ananeeya - Sappeeraalu - Neemudaachiri Maranamondiri
|| A ||
5)
Pisinigottuku Cheedapeedalu - Anni Taraalaku Antivachchunu
Keedu Vitti Melu Kotuvaa - Mundla Kanchelo Pandlu Dorukunaa
|| A ||
6)
Devudichchina Paadipantalu - Dandigaa Aasinchuchunduvu
Dasamabhaagamuteeya Veratuvu - Daiva Kaaryamuletlu Jarugunu
|| A ||
Present