తెలుగు దేవుని సొమ్ము దేవునికిమ్ము
పల్లవిదేవుని సొమ్ము దేవునికిమ్ము దీవెన పొందెదవు ఈ భువిలో... ఆ దివిలో
1)సకలముచేసిన సర్వేశ్వరుడు తనసుతునిడె నీ రక్షణ కొరకై
యేసుని రుణము ఎన్నడు తీర్తువు
|| దేవుని ||
2)గాలివెలుతురు వర్షసంపదలు దారపుత్రుల ధరణిలో నొసగ
ధర్మము చేయుము ధారాళముగా
|| దేవుని ||
3)యేది ధన్యతని యేసు చెప్పెను పుచ్చుకొనుటయా ఇచ్చుటయా
ప్రాణమిచ్చెగ పావనమూర్తి
|| దేవుని ||
4)పోసిన వానికి పోయబడునులే ఇచ్చిన వానికి ఇవ్వబడునులే
ఇచ్చిన వానిని మెచ్చుకొనునులే
|| దేవుని ||
5)కలిమికొలదియె బలిమి లేదులే వర్ధిల్లిన కొలదే వసుధలోనిచ్చి
యేసుని సేవలో ఎదుగుచుండుమా
|| దేవుని ||
6)ముదముతోడనె సదయుని కొరకు శక్తి కొలదియె భక్తి తోడనే
ప్రభువు సేవలో పాలుపొందుమా
|| దేవుని ||
English Devuni Sommu Devunikimmu
ChorusDevuni Sommu Devunikimmu Deevena Pondedavu Ee Bhuvilo... Aa Divilo
1)Sakalamuchesina Sarvesvarudu Tanasutunide Nee Rakshana Korakai
Yesuni Runamu Ennadu Teertuvu
|| Devuni ||
2)Gaaliveluturu Varshasanpadalu Daaraputrula Dharanilo Nosaga
Dharmamu Cheyumu Dhaaraalamugaa
|| Devuni ||
3)Yedi Dhanyatani Yesu Cheppenu Puchchukonutayaa Ichchutayaa
Praanamichchega Paavanamoorti
|| Devuni ||
4)Posina Vaaniki Poyabadunule Ichchina Vaaniki Ivvabadunule
Ichchina Vaanini Mechchukonunule
|| Devuni ||
5)Kalimikoladiye Balimi Ledule Vardhillina Kolade Vasudhalonichchi
Yesuni Sevalo Eduguchundumaa
|| Devuni ||
6)Mudamutodane Sadayuni Koraku Sakti Koladiye Bhakti Todane
Prabhuvu Sevalo Paalupondumaa
|| Devuni ||