తెలుగు నీతియుక్తమైన బలులు
పల్లవినీతి యుక్తమైన బలులు నీకర్పించుచు
నిత్యసత్యుడ యేసు నిన్నే కొలుతుము
1)పాపులమగు మా కొరకు - ప్రాణము బెట్టిన ప్రభువా
ప్రేమతోడనే మాదు - పాపములు క్షమియించి
పరలోక భాగ్యమును - ప్రియముగ మా కొసగితివి
పరమాత్మాడాయేసు - ప్రియముగ నిను కొలుతుము
|| నీతి ||
2)నీయందలి యానందము - బలమొంద జేయును
నీ మధుర వాక్కులు - మాడెందములకు విందు
నిత్యానందమునొసగిన - యేసయ్య వందనము
నిత్యజీవమిచ్చిన - నీకే మా స్తోత్రములు
|| నీతి ||
3)నలిగినట్టి వారిని - విడువనట్టి వినయశీలి
కృంగినట్టి వారిని - లేవనెత్తు గుణశీలి
జయశాలి సుగుణశీలి - చూపితి మాపై జాలి
సత్యశీలి యేసువా - నడుతుము నిను పోలి
|| నీతి ||
4)సకలైశ్వర్యములకు - నిలయమైనవాడా
సకలాశ్వీరచన - స్తోత్రములకు పాత్రుడా
అన్ని నామములకును - పైనున్న వాడా
ఘనమైన నీ నామము - స్తుతి నొందను గాక
|| నీతి ||
English Neethiyuktamaina Balulu
ChorusNeeti Yuktamaina Balulu Neekarpinchuchu
Nityasatyuda Yesu Ninne Kolutumu
1)Paapulamagu Maa Koraku - Praanamu Bettina Prabhuvaa
Prematodane Maadu - Paapamulu Kshamiyinchi
Paraloka Bhaagyamunu - Priyamuga Maa Kosagitivi
Paramaatmaadaayesu - Priyamuga Ninu Kolutumu
|| Neeti ||
2)Neeyandali Yaanandamu - Balamonda Jeyunu
Nee Madhura Vaakkulu - Maadendamulaku Vindu
Nityaanandamunosagina - Yesayya Vandanamu
Nityajeevamichchina - Neeke Maa Stotramulu
|| Neeti ||
3)Naliginatti Vaarini - Viduvanatti Vinayaseeli
Krnginatti Vaarini - Levanettu Gunaseeli
Jayasaali Sugunaseeli - Choopiti Maapai Jaali
Satyaseeli Yesuvaa - Nadutumu Ninu Poli
|| Neeti ||
4)Sakalaisvaryamulaku - Nilayamainavaadaa
Sakalaasveerachana - Stotramulaku Paatrudaa
Anni Naamamulakunu - Painunna Vaadaa
Ghanamaina Nee Naamamu - Sthuthi Nondanu Gaaka
|| Neeti ||