తెలుగు అర్పించుడీ హృదయమును
పల్లవిఅర్పించుడి హృదయమును - అభిషిక్తుని సన్నిధిలో
ఆకాశపు వాకిండ్లను విప్పి - కురిపించును దీవెనలు
1)పరిశుద్ధుల అర్పణలే - పరిమళమగు ద్రవ్యములు
ప్రభు మందిర నిధిలో సమర్పణలే - పవిత్రపు పోషణలు
|| అ ||
2)పరిశుద్ధుల ఫలములలో - పదియవ భాగము ప్రభుదే
ప్రతి రాబడిలో - ప్రభువునకొసగి - ప్రభులో వర్ధిల్లెదము
|| అ ||
3)పరిశుద్ధుల మందిరమే - ప్రత్యక్ష గుడారంబు
ప్రభు సేవకులే పరిచారకులు - పరలోకపు యాజకులు
|| అ ||
4)పరిశుద్ధుల ప్రార్థనలే - ప్రభునకు ధూపార్చనలు
విరిగిన మనసు నలిగిన హృదయం - వెలగల నైవేద్యములు
|| అ ||
5)పరిశుద్ధారాధనలే - పరిహారపు యాగములు
సిలువను మోసి, శ్రమలను భరించి, బలిపీఠము చేరుదుము
|| అ ||
6)పరిశుద్ధ ప్రవర్తనయే - ప్రభునకు ప్రతిష్ఠార్పణలు
ప్రశస్తపు వస్త్రమును ధరించి - పరదైసున కేగెదము
|| అ ||
7)పరిశుద్ధుల గానములే - పరమాత్మకు హోమములు
పరిచర్యలలో పరిపూర్ణులమై - పాడెదము హల్లెలూయా
|| అ ||
English Arpincudi Hrudayamunu
ChorusArpinchudi Hrudayamunu - Abhishiktuni Sannidhilo
Aakaasapu Vaakindlanu Vippi - Kuripinchunu Deevenalu
1)Parisuddhula Arpanale - Parimalamagu Dravyamulu
Prabhu Mandira Nidhilo Samarpanale - Pavitrapu Poshanalu
|| A ||
2)Parisuddhula Phalamulalo - Padiyava Bhaagamu Prabhude
Prati Raabadilo - Prabhuvunakosagi - Prabhulo Vardhilledamu
|| A ||
3)Parisuddhula Mandirame - Pratyaksha Gudaaranbu
Prabhu Sevakule Parichaarakulu - Paralokapu Yaajakulu
|| A ||
4)Parisuddhula Praarthanale - Prabhunaku Dhoopaarchanalu
Virigina Manasu Naligina Hrudayan - Velagala Naivedyamulu
|| A ||
5)Parisudhaaraadhanale - Parihaarapu Yaagamulu
Siluvanu Mosi, Sramalanu Bharinchi, Balipeethamu Cherudumu
|| A ||
6)Parisudha Pravartanaye - Prabhunaku Pratishthaarpanalu
Prasastapu Vastramunu Dharinchi - Paradaisuna Kegedamu
|| A ||
7)Parisuddhula Gaanamule - Paramaatmaku Homamulu
Paricharyalalo Paripoornulamai - Paadedamu Hallelooyaa
|| A ||