Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 185 Old No: 114

నీ రాబడిలో ప్రథమ

Nee Raabadilo Prathama

Open in Word & Worship App
తెలుగు   నీ రాబడిలో ప్రథమ
పల్లవి
నీ రాబడిలో ప్రథమ ఫలములు - దశమాంశము నీయుము
నీ యాస్తిలో భాగంబునిచ్చి - దేవుని ఘనపరచుము
ఓ ప్రియుడా దేవుని ఘనపరచుము
1)
అప్పుడు నీ కొట్లలో ధాన్యము - సమృద్ధిగా నుండున్‌
ఎప్పుడును నీ పనిలో ఫలము విస్తారమగును
ఓ ప్రియుడా ఫలము విస్తారమగును
|| నీ రాబడి ||
2)
వెదజల్లిన విస్తారమైన అభివృద్ధి కలుగున్‌ - తగినదానికన్న
తక్కువ యిచ్చిన లేమి మరి కలుగున్‌
ఓ ప్రియుడా లేమి మరి కలుగున్‌
|| నీ రాబడి ||
3)
అభివృద్ధి పొందిన కొలది ప్రభువునకు - ప్రియముగ నర్పించుము
ప్రభువు పనికి ద్రవ్యము నిచ్చిన - ఫలమెంతో కల్గును
ఓ ప్రియుడా ఫలమెంతో కల్గును
|| నీ రాబడి ||
4)
శక్తికి మించి కాదుగాని - కలిమికొలదె యిమ్ము
సిద్ధమైన మనసువుంటె అదియే ప్రియమేసునకు
ఓ ప్రియుడా అదియే ప్రియమేసునకు
|| నీ రాబడి ||
5)
సంతసముగ నిచ్చిన కాసే - ప్రియము ప్రభువునకు
పంతముతో పదిలక్షలిచ్చిన తక్కువె కాసునకు
ఓ ప్రియుడా తక్కువె కాసునకు
|| నీ రాబడి ||
English   Nee Raabadilo Prathama
Chorus
Nee Raabadilo Prathama Phalamulu - Dasamaansamu Neeyumu
Nee Yaastilo Bhaaganbunichchi - Devuni Ghanaparachumu
O Priyudaa Devuni Ghanaparachumu
1)
Appudu Nee Kotlalo Dhaanyamu - Samrddhigaa Nundun
Eppudunu Nee Panilo Phalamu Vistaaramagunu
O Priyudaa Phalamu Vistaaramagunu
|| Nee Raabadi ||
2)
Vedajallina Vistaaramaina Abhivruddhi Kalugun - Taginadaanikanna
Takkuva Yichchina Lemi Mari Kalugun
O Priyudaa Lemi Mari Kalugun
|| Nee Raabadi ||
3)
Abhivruddhi Pondina Koladi Prabhuvunaku - Priyamuga Narpinchumu
Prabhuvu Paniki Dravyamu Nichchina - Phalamento Kalgunu
O Priyudaa Phalamento Kalgunu
|| Nee Raabadi ||
4)
Saktiki Minchi Kaadugaani - Kalimikolade Yimmu
Sidhamaina Manasuvunte Adiye Priyamesunaku
O Priyudaa Adiye Priyamesunaku
|| Nee Raabadi ||
5)
Santasamuga Nichchina Kaase - Priyamu Prabhuvunaku
Pantamuto Padilakshalichchina Takkuve Kaasunaku
O Priyudaa Takkuve Kaasunaku
|| Nee Raabadi ||
Present