Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 181 Old No: 109

నీ ధనము నీ ఘనము

Nee Dhanamu Nee Ghanamu

Open in Word & Worship App
తెలుగు   నీ ధనము నీ ఘనము
పల్లవి
నీ ధనము - నీ ఘనము ప్రభుయేసుదే
నీ దశమ భాగము నీయ - వెనుదీతువా
1)
ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా
పరలోకనాథుండు నీకీయగా - మరి యేసు కొరకీయ వెనుదీతువా
|| నీ ||
2)
పాడిపంటలు ప్రభువు నీకీయగా - కూడుగుడ్డలు నీకు దయచేయగా
వేడంగ ప్రభుయేసు నామంబును - గడువేల ప్రభుకీ యనో క్రైస్తవ
|| నీ ||
3)
వెలుగు నీడలు గాలి వర్షంబులు - కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా
వెలిగించ ధరపైన ప్రభునామమును-కలిమికొలదిప్రభునకర్పింపవా
|| నీ ||
4)
కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ - భరితంబులు
బలియాయె నీపాపముల కోసమే చెలువంగ ప్రభుకీయ చింతింతువా
|| నీ ||
English   Nee Dhanamu Nee Ghanamu
Chorus
Nee Dhanamu - Nee Ghanamu Prabhuyesude
Nee Dasama Bhaagamu Neeya - Venudeetuvaa
1)
Dharalona Dhana Dhaanyamula Neeyagaa Karuninchi Kaapaadi Rakshinpagaa
Paralokanaathundu Neekeeyagaa - Mari Yesu Korakeeya Venudeetuvaa
|| Nee ||
2)
Paadipantalu Prabhuvu Neekeeyagaa - Kooduguddalu Neeku Dayacheyagaa
Vedanga Prabhuyesu Naamanbunu - Gaduvela Prabhukee Yano Kraistava
|| Nee ||
3)
Velugu Needalu Gaali Varshanbulu - Kaliginche Prabhu Neeku Uchitanbugaa
Veligincha Dharapaina Prabhunaamamunu-Kalimikoladiprabhunakarpinpavaa
|| Nee ||
4)
Kaliginche Sakalanbu Samrddhigaa Tolaginche Palubaadha - Bharitanbulu
Baliyaaye Neepaapamula Kosame Cheluvanga Prabhukeeya Chintintuvaa
|| Nee ||
Present