తెలుగు స్తుతిగీతము పాడెదము
పల్లవిస్తుతిగీతము పాడెదము - ప్రభుసేవకై నిలిచెదము
సమర్పింతుము సర్వము యేసునకే ప్రాణమిత్తుము ప్రభుకొరకే
1)ప్రభు హస్తమే నిన్ను సృష్టిజేసెన్ - నీ హృదయము యేసునకిమ్ము
నీ ఆత్మ శరీరముల్ ప్రభుకే - అర్పించి స్తుతించుము ప్రియుడా
|| స్తుతి ||
2)ప్రభు నీకిచ్చెను ఎన్నో వరముల్ - ప్రభుపనికై వాడుము వాటిన్
నీ జ్ఞానము బలమును ప్రభుకే - అర్పించి స్తుతించుము ప్రియుడా
|| స్తుతి ||
3)వ్యాధి బాధల నుండి నిన్ను గాచెన్ - యింత కాలము ప్రేమతో బ్రోచెన్
నీ సమయము యేసుని పనికే - అర్పించి స్తుతించుము ప్రియుడా
|| స్తుతి ||
4)సర్వమిచ్చెను యేసుడు నీకై పోషించుచున్నాడను దినము
ప్రభుపనికై నీ సర్వధనమున్ - అర్పించి స్తుతించుము ప్రియుడా
|| స్తుతి ||
5)తన రక్తము కార్చెను నీకై - ఘనరక్షణ నిడె యుచితముగా
నీ జీవితమంతా ప్రభుకే - అర్పించి స్తుతించుము ప్రియుడా
|| స్తుతి ||
6)నిత్యజీవము సిద్ధముజేసెన్ - నిత్యమహిమకు నిను యేర్పరచెన్
నీ గృహమును ప్రియులను ప్రభుకే - అర్పించి స్తుతించుము
ప్రియుడా
|| స్తుతి ||
English Stutigeethamu Paadedamu
ChorusSthuthigeetamu Paadedamu - Prabhusevakai Nilichedamu
Samarpintumu Sarvamu Yesunake Praanamittumu Prabhukorake
1)Prabhu Hastame Ninnu Srushtijesen - Nee Hrudayamu Yesunakimmu
Nee Aatma Sareeramul Prabhuke - Arpinchi Sthuthinchumu Priyudaa
|| Sthuthi ||
2)Prabhu Neekichchenu Enno Varamul - Prabhupanikai Vaadumu Vaatin
Nee Gnaanamu Balamunu Prabhuke - Arpinchi Sthuthinchumu Priyudaa
|| Sthuthi ||
3)Vyaadhi Baadhala Nundi Ninnu Gaachen - Yinta Kaalamu Premato Brochen
Nee Samayamu Yesuni Panike - Arpinchi Sthuthinchumu Priyudaa
|| Sthuthi ||
4)Sarvamichchenu Yesudu Neekai Poshinchuchunnaadanu Dinamu
Prabhupanikai Nee Sarvadhanamun - Arpinchi Sthuthinchumu Priyudaa
|| Sthuthi ||
5)Tana Raktamu Kaarchenu Neekai - Ghanarakshana Nide Yuchitamugaa
Nee Jeevitamantaa Prabhuke - Arpinchi Sthuthinchumu Priyudaa
|| Sthuthi ||
6)Nityajeevamu Sidhamujesen - Nityamahimaku Ninu Yerparachen
Nee Gruhamunu Priyulanu Prabhuke - Arpinchi Sthuthinchumu
Priyudaa
|| Sthuthi ||