Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 179 Old No: 116

సంతోషముతో నిచ్చెడు

Santoshamuto Nichcedu

Open in Word & Worship App
తెలుగు   సంతోషముతో నిచ్చెడు
పల్లవి
సంతోషముతో నిచ్చెడు వారిని - ఎంతో దేవుడు ప్రేమించున్‌
వింతగ వలసినదంతయు నొసగును - వినయ మనసుగల విశ్వాసులకును
1)
అత్యాసక్తితో నధిక ప్రేమతో - నంధకార జనులందరకు
సత్యసువార్తను - జాటించుటకై - సతతము దిరిగెడు సద్భక్తులకు
|| సం ||
2)
వేద వాక్యమును వేరు వేరు గ్రామాదుల నుండెడు బాలురకు
సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి - సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు
|| సం ||
3)
దిక్కెవ్వరు లేకుండెడి దీనుల - తక్కువ లన్నిటిందీర్చుటకై
నిక్కపు రక్షణ - నిద్దరలో నలు-ప్రక్కలలోం బ్రక-టించుట కొఱకై
|| సం ||
4)
ఇయ్యండీ మీ కీయంబడునని - యియ్యంగల ప్రభు యేసనెను
ఇయ్యది మరువక - మదిని నుంచుకొని - యియ్యవలెను
మన - యీవుల నికను
|| సం ||
5)
భక్తిగలిగి ప్రభు పనికిచ్చుట బహు - యుక్తమటంచును
దారతతో - శక్తికొలది మన భుక్తి నుండి యా-సక్తితో
నిరతము నియ్యవలెను
|| సం ||
English   Santoshamuto Nichcedu
Chorus
Santoshamuto Nichchedu Vaarini - Ento Devudu Preminchun
Vintaga Valasinadantayu Nosagunu - Vinaya Manasugala Visvaasulakunu
1)
Atyaasaktito Nadhika Premato - Nandhakaara Janulandaraku
Satyasuvaartanu - Jaatinchutakai - Satatamu Dirigedu Sadbhaktulaku
|| San ||
2)
Veda Vaakyamunu Veru Veru Graamaadula Nundedu Baaluraku
Saadhulu Prabhuni Su-Bodhalu Nerpedi - Sajjana Kraistavopaadhyaayulaku
|| San ||
3)
Dikkevvaru Lekundedi Deenula - Takkuva Lannitindeerchutakai
Nikkapu Rakshana - Niddaralo Nalu-Prakkalalon Braka-Tinchuta Korakai
|| San ||
4)
Iyyandee Mee Keeyanbadunani - Yiyyangala Prabhu Yesanenu
Iyyadi Maruvaka - Madini Nunchukoni - Yiyyavalenu
Mana - Yeevula Nikanu
|| San ||
5)
Bhaktigaligi Prabhu Panikichchuta Bahu - Yuktamatanchunu
Daaratato - Saktikoladi Mana Bhukti Nundi Yaa-Saktito
Niratamu Niyyavalenu
|| San ||
Present