Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 174

దేవా నిను మేమారదింతుము

Devaa Ninu Memaaradintuamu

Open in Word & Worship App
తెలుగు   దేవా నిను మేమారదింతుము
పల్లవి
దేవా నిను మేమారాధింతుము - యేసుక్రీస్తు పావన ప్రభువా
1)
వ్యసనాక్రాంతుడ వైతివి సిల్వన్‌ వ్యాధి నొందిన వాడవైతివి
సొగసైనను సురూపమైనను లేదేమి యపేక్షించుటకు
|| దేవా ||
2)
మాయతిక్రమక్రియ దోషంబులకై గాయములొంది మొత్తబడితివి-
మాదు సమాధాన శిక్షనుపొంది స్వస్థత నిచ్చిన సత్యస్వరూప
|| దేవా ||
3)
కపటములేదు చూడగ నీనోటన్‌ వంచకుడంచు హేళనచేయగ -
మౌనివైతివి నోరుతెరువక వధకుతేబడు గొఱ్ఱెపిల్లవలె
|| దేవా ||
4)
అవమానము నిర్లక్ష్యము చేసి సహించితి వన్యాయపుతీర్పు తండ్రీ
వీరుచేయుచున్నది ఎరుగరు గనుక క్షమించుమంటివి
|| దేవా ||
5)
వేదన చూచియు తృప్తి నొందితివి బలియై సిలువలో మమ్మును
కంటివి తండ్రి కోరికను సఫలముచేసి మృత్యుంజయుడవై
లేచిన ప్రభూ
|| దేవా ||
English   Devaa Ninu Memaaradintuamu
Chorus
Devaa Ninu Memaaraadhintumu - Yesukreestu Paavana Prabhuvaa
1)
Vyasanaakraantuda Vaitivi Silvan Vyaadhi Nondina Vaadavaitivi
Sogasainanu Suroopamainanu Ledemi Yapekshinchutaku
|| Devaa ||
2)
Maayatikramakriya Doshanbulakai Gaayamulondi Mottabaditivi-
Maadu Samaadhaana Sikshanupondi Svasthata Nichchina Satyasvaroopa
|| Devaa ||
3)
Kapatamuledu Choodaga Neenotan Vanchakudanchu Helanacheyaga -
Maunivaitivi Noruteruvaka Vadhakutebadu Gorrepillavale
|| Devaa ||
4)
Avamaanamu Nirlakshyamu Chesi Sahinchiti Vanyaayaputeerpu Tandree
Veerucheyuchunnadi Erugaru Ganuka Kshaminchumantivi
|| Devaa ||
5)
Vedana Choochiyu Trupti Nonditivi Baliyai Siluvalo Mammunu
Kantivi Tandri Korikanu Saphalamuchesi Mrtyunjayudavai
Lechina Prabhoo
|| Devaa ||
Present