Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 173

దేవుని స్వరూపివై

Devuni Svaroopivai

Open in Word & Worship App
తెలుగు   దేవుని స్వరూపివై
పల్లవి
దేవుని స్వరూపివై - సమానముగ నుండియు
మిన్ను విడచి నన్ను జేరినట్టి దేవ స్తోత్రముల్‌
సతతము దూతాళితోడ స్తోత్ర గీతమందు నీవు
కన్నతండ్రి ఇంటిని వదలినట్టి యేసువా
1)
గెత్సెమనెడి వనములోన - హెచ్చెనయ్యె శ్రమలు
చెమట గొప్ప రక్త బిందువుల వలె - స్రవించెగ
దైవచిత్త మెరిగినట్టి - దైవ సుతుడ నీవెగా
నాడు క్రోధ పాత్ర ద్రావి - నన్ను గాచి బ్రోచితి
|| దేవుని ||
2)
కల్వరిలో సిలువపైన - ఘోర మరణ మొందియు
కలుషములు హరించినన్ను - కనికరించి బ్రోచితి
వెలువగలుగు నీదు ప్రేమ - కొలువగనా శక్యమా!
నలిగినట్టి నాదు హృదయ స్తుతులు నీకు అర్పణ
|| దేవుని ||
3)
వ్యసనములను వ్యాధి బాధలనుభవించినాడవే
గవిని బయట శ్రమలు పొంద - ఖాయపడితి నీవెగ
మరణమొంది మరలలేచి - పరము కరిగినాడవే
ఏవిధముగ నీకు స్తుతి చెల్లింపకుందు నేసువా
|| దేవుని ||
English   Devuni Svaroopivai
Chorus
Devuni Svaroopivai - Samaanamuga Nundiyu
Minnu Vidachi Nannu Jerinatti Deva Stotramul
Satatamu Dootaalitoda Stotra Geetamandu Neevu
Kannatandri Intini Vadalinatti Yesuvaa
1)
Getsemanedi Vanamulona - Hechchenayye Sramalu
Chemata Goppa Rakta Binduvula Vale - Sravinchega
Daivachitta Meriginatti - Daiva Sutuda Neevegaa
Naadu Krodha Paatra Draavi - Nannu Gaachi Brochiti
|| Devuni ||
2)
Kalvarilo Siluvapaina - Ghora Marana Mondiyu
Kalushamulu Harinchinannu - Kanikarinchi Brochiti
Veluvagalugu Needu Prema - Koluvaganaa Sakyamaa!
Naliginatti Naadu Hrudaya Stutulu Neeku Arpana
|| Devuni ||
3)
Vyasanamulanu Vyaadhi Baadhalanubhavinchinaadave
Gavini Bayata Sramalu Ponda - Khaayapaditi Neevega
Maranamondi Maralalechi - Paramu Kariginaadave
evidhamuga Neeku Sthuthi Chellinpakundu Nesuvaa
|| Devuni ||
Present