Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 17 Old No: 24

వెదకని నాకు దిరికితివి

Vedakani Naaku Dorikitivi

♪ P.Bikshaalu
Open in Word & Worship App
తెలుగు   వెదకని నాకు దిరికితివి
పల్లవి
వెదకని నాకు దొరికితివి - నను రక్షింపను వెదికితివి యేసూ!
నను కరుణించితివి
1)
నీ మార్గంబును తొలగితిని - నిన్నెరుగకయే మెలగితిని
కన్నులు గానక తిరిగితిని - మంటిని నేనని మరచితిని
|| వెద ||
2)
ఎంతగానో నను ప్రేమించి - ఈ లోకమునకు అరుదెంచి
దాసుని రూపము ధరియించి - నా పాపములను భరియించి
|| వెద ||
3)
నాకై ప్రాణము బెట్టితివి - మధ్యగోడ పడగొట్టితివి
నీ మందిరముగ కట్టితివి - నీ కొమరునిగ నిలబెట్టితివి
|| వెద ||
4)
నీ శక్తితో నను నింపుము - నీ పనికైనను బంపుము
నిత్యము నన్ను నడిపించుము - నీకు సాక్షిగా నుంచుము
|| వెద ||
5)
ఆరాధింతును ఆశ్రయుడా - ఆత్మతోడ సత్యముతోడ
స్తుతియించెద నిను స్తోత్రార్హుడా - అద్వితీయుడా నా ప్రభువా
|| వెద ||
English   Vedakani Naaku Dorikitivi
Chorus
Vedakani Naaku Dorikitivi - Nanu Rakshinpanu Vedikitivi Yesoo!
Nanu Karuninchitivi
1)
Nee Maarganbunu Tolagitini - Ninnerugakaye Melagitini
Kannulu Gaanaka Tirigitini - Mantini Nenani Marachitini
|| Veda ||
2)
Entagaano Nanu Preminchi - Ee Lokamunaku Arudenchi
Daasuni Roopamu Dhariyinchi - Naa Paapamulanu Bhariyinchi
|| Veda ||
3)
Naakai Praanamu Bettitivi - Madhyagoda Padagottitivi
Nee Mandiramuga Kattitivi - Nee Komaruniga Nilabettitivi
|| Veda ||
4)
Nee Saktito Nanu Ninpumu - Nee Panikainanu Banpumu
Nityamu Nannu Nadipinchumu - Neeku Saakshigaa Nunchumu
|| Veda ||
5)
Aaraadhintunu Aasrayudaa - Aatmatoda Satyamutoda
Sthuthiyincheda Ninu Stotraarhudaa - Adviteeyudaa Naa Prabhuvaa
|| Veda ||
Present