తెలుగు సిలువలో సాగింది యాత్ర
పల్లవిసిలువలో సాగింది యాత్ర - కరుణామయుని
దయగల పాత్ర - ఇది ఎవరి కోసమో\...
ఈ జనుల కోసమె - ఈ జగతి కోసమే
1)పాలుగారే దేహంబుపైనా - పాపాత్ముల కొరడాలెన్నో
నాట్యమాడినాయి - నడివీధిని నడచాయి
నోరు తెరువలేదాయె ప్రభువు - బదులు పలుకలేదాయె ప్రేమా
ఇది ఎవరి కోసమో - ఈ జనుల కోసమే - ఈ జగతి కోసమే
|| సిలువ ||
2)చెల్లుమని కొట్టింది ఒకరూ - ముందు నిలచి నవ్వింది మరియొకరు
బంతులాడినారా - పిడి గుద్దులు గ్రుద్దారా!
నోరు తెరువలేదాయె ప్రభువు - బదులు పలుకలేదాయె ప్రేమ
ఇది ఎవరి కోసమో - ఈ జనుల కోసమే - ఈ జగతి కోసమె
|| సిలువ ||
3)తలను ముండ్లు గ్రుచ్చింది ఒకరు - చీలలు నాటింది మరియొకరు
గాయపరచినారా - పలుబాధలు పెట్టారా
నోరు తెరువలేదాయె ప్రభువు - బదులు పలుకలేదాయె ప్రేమ
ఇది ఎవరి కోసమో - ఈ జనుల కోసమె - ఈ జగతి కోసమె
|| సిలువ ||
4)దాహమని అడిగాడు ప్రభువు - చేదు దాహమిచ్చింది లోకం
చిరకనిచ్చినారా - మరి బరిసను గ్రుచ్చారా
ఆత్మనప్పగించేను యేసు - వాలిపోయినడాయె ప్రభువు
ఇది ఎవరి కోసమో - ఈ జనుల కోసమె - ఈ జగతి కోసమె
|| సిలువ ||
5)దొంగలలో దూషించెనొకడు - దైవరాజ్యమాసించె మరి ఒకడు
దయను చూపినాడు - పరదైసు చేర్చినాడు
విశ్వసించు వారెందరినైనా - ప్రేమతో క్షమించునయా
నీకు రక్షణిచ్చునూ - నిను పరము జేర్చును - తనతోడ నుంచును
|| సిలువ ||
English Siluvalo Saagindi Yaatra
ChorusSiluvalo Saagindi Yaatra - Karunaamayuni
Dayagala Paatra - Idi Evari Kosamo\...
Ee Janula Kosame - Ee Jagati Kosame
1)Paalugaare Dehanbupainaa - Paapaatmula Koradaalenno
Naatyamaadinaayi - Nadiveedhini Nadachaayi
Noru Teruvaledaaye Prabhuvu - Badulu Palukaledaaye Premaa
Idi Evari Kosamo - Ee Janula Kosame - Ee Jagati Kosame
|| Siluva ||
2)Chellumani Kottindi Okaroo - Mundu Nilachi Navvindi Mariyokaru
Bantulaadinaaraa - Pidi Guddulu Gruddaaraa!
Noru Teruvaledaaye Prabhuvu - Badulu Palukaledaaye Prema
Idi Evari Kosamo - Ee Janula Kosame - Ee Jagati Kosame
|| Siluva ||
3)Talanu Mundlu Gruchchindi Okaru - Cheelalu Naatindi Mariyokaru
Gaayaparachinaaraa - Palubaadhalu Pettaaraa
Noru Teruvaledaaye Prabhuvu - Badulu Palukaledaaye Prema
Idi Evari Kosamo - Ee Janula Kosame - Ee Jagati Kosame
|| Siluva ||
4)Daahamani Adigaadu Prabhuvu - Chedu Daahamichchindi Lokam
Chirakanichchinaaraa - Mari Barisanu Gruchchaaraa
Aatmanappaginchenu Yesu - Vaalipoyinadaaye Prabhuvu
Idi Evari Kosamo - Ee Janula Kosame - Ee Jagati Kosame
|| Siluva ||
5)Dongalalo Dooshinchenokadu - Daivaraajyamaasinche Mari Okadu
Dayanu Choopinaadu - Paradaisu Cherchinaadu
Visvasinchu Vaarendarinainaa - Premato Kshaminchunayaa
Neeku Rakshanichchunoo - Ninu Paramu Jerchunu - Tanatoda Nunchunu
|| Siluva ||