Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 164 Old No: 578

యేసుప్రభు నీ హృదయం

Yesuprahu Nee Hrudayam

Open in Word & Worship App
తెలుగు   యేసుప్రభు నీ హృదయం
పల్లవి
యేసుప్రభు నీ హృదయం - అంతరంగములో మైనమువలె కరిగినదా
1)
పదివేలమందిలో గుర్తింపతగిన - నీ ముఖం పై ఉమ్మి ఊసినపుడు
అపరంజి వంటి నీ శిరమున - ముండ్ల కిరీటం మొత్తినపుడు
యూదులరాజా నీకు శుభమని - రాణువవారు అపహసించినపుడు
|| యేసు ||
2)
నీ వీపునంతటిని కోరడాలతో - నాగటిచాళ్ళవలె దున్నినప్పుడు
మోయలేని మ్రానునొకటి - నీ వీపున మోసినప్పుడు
మెత్తనైన నీ పాదాలు - మెట్టలు గుట్ట లెక్కినప్పుడు
|| యేసు ||
3)
ఇద్దరు నేరస్తుల మధ్యలో నిన్ను - కలువరిలో సిలువ వేసినపుడు
కాలు చేతులను మేకులతో - కఠినులు కొయ్యకు కొట్టినప్పుడు
నేయబడిన నీ అంగీకొరకు - చీట్లు వేసి వారు పంచుకొన్నప్పుడు
|| యేసు ||
English   Yesuprahu Nee Hrudayam
Chorus
Yesuprabhu Nee Hrudayan - Antarangamulo Mainamuvale Kariginadaa
1)
Padivelamandilo Gurtinpatagina - Nee Mukhan Pai Ummi Oosinapudu
Aparanji Vanti Nee Siramuna - Mundla Kireetan Mottinapudu
Yoodularaajaa Neeku Subhamani - Raanuvavaaru Apahasinchinapudu
|| Yesu ||
2)
Nee Veepunantatini Koradaalato - Naagatichaallavale Dunninappudu
Moyaleni Mraanunokati - Nee Veepuna Mosinappudu
Mettanaina Nee Paadaalu - Mettalu Gutta Lekkinappudu
|| Yesu ||
3)
Iddaru Nerastula Madhyalo Ninnu - Kaluvarilo Siluva Vesinapudu
Kaalu Chetulanu Mekulato - Kathinulu Koyyaku Kottinappudu
Neyabadina Nee Angeekoraku - Cheetlu Vesi Vaaru Panchukonnappudu
|| Yesu ||
Present