Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 162 Old No: 559

నను ప్రేమించిన యేసయ్య

Nanu Premincina Yesayya

Open in Word & Worship App
తెలుగు   నను ప్రేమించిన యేసయ్య
పల్లవి
నను ప్రేమించిన యేసయ్యా - నిన్ను నేను స్తుతింతునయ్యా
నాకాదరణా నానందము నీవే - నను రక్షించిన రక్షకుడా
1)
బలహీనుడను బహు పాపిని - ధనహీనుడను దరిద్రుడను
ఏమి చూచి నన్ను వెదకి రక్షించినావు
ఎంత ప్రేమ నీది - లోకానికి ఒక వింతది
|| నను ||
2)
వీధులలో బడి మోశావు భారమైన సిలువను నీవు
నా పాపపు మోపంతా నీ వీపుపై మోశావు
దాపు చేరిన నన్ను - దయతో మన్నించిన దేవా
|| నను ||
3)
మరణమును జయించితివి - మృత్యువును ఓడించితివి
మరణించనున్న నాకు - జీవంబు నిచ్చినావు
ఏమి నీకర్పింతు నా వందనం బిదె గాను
|| నను ||
English   Nanu Premincina Yesayya
Chorus
Nanu Preminchina Yesayyaa - Ninnu Nenu Sthuthintunayyaa
Naakaadaranaa Naanandamu Neeve - Nanu Rakshinchina Rakshakudaa
1)
Balaheenudanu Bahu Paapini - Dhanaheenudanu Daridrudanu
emi Choochi Nannu Vedaki Rakshinchinaavu
Enta Prema Needi - Lokaaniki Oka Vintadi
|| Nanu ||
2)
Veedhulalo Badi Mosaavu Bhaaramaina Siluvanu Neevu
Naa Paapapu Mopantaa Nee Veepupai Mosaavu
Daapu Cherina Nannu - Dayato Manninchina Devaa
|| Nanu ||
3)
Maranamunu Jayinchitivi - Mrtyuvunu Odinchitivi
Maraninchanunna Naaku - Jeevanbu Nichchinaavu
emi Neekarpintu Naa Vandanam Bide Gaanu
|| Nanu ||
Present