తెలుగు స్తోత్రమురాజా! స్తోత్రము
పల్లవిస్తోత్రము రాజా! స్తోత్రము రాజా...
స్తోత్రము రాజాధిరాజా!... స్తోత్రమురాజా
1)స్తోత్రపాత్రుడ! పూజనీయుడ - నిత్యము నా శ్రితుల పాలుడ
సత్యుడా! పర - లోకవాసుడా! నిత్యుడా! శ్రీయేసు నాధుడా!
|| స్తో ||
2)ఆకసము నీ - మహిమను - ఇహ - లోకమందలి సర్వమును
ఏకముగనుతి యించుచుండ - నీ కర్పించెద జిహ్వ ఫలములు
|| స్తో ||
3)ఇడుములు కడు - సుడులకైవడి వడి వడిగ నను పెనుగొనంగ
విడువను యెడబాయనంచు - విజయమిచ్చిన - యేసురాజా!
|| స్తో ||
4)మరణచ్ఛాయ లోయలోబడి - తెరవుగానక నరుగువేళ
పరమ కనికర కరముచే నను - సరిగ నడిపిన - మాదు ప్రభువా
|| స్తో ||
5)ఆరయ నాలో నీదు రూపము - సరిగ నేర్పడు వరకునన్ను
తఱచు శ్రమల యనుభవంబున - పొరల జేసిన యేసురాజా
|| స్తో ||
English Stotramuraajaa! Stotramu
ChorusStotramu Raajaa! Stotramu Raajaa...
Stotramu Raajaadhiraajaa!... Stotramuraajaa
1)Stotrapaatruda! Poojaneeyuda - Nityamu Naa Sritula Paaluda
Satyudaa! Para - Lokavaasudaa! Nityudaa! Sreeyesu Naadhudaa!
|| Sto ||
2)Aakasamu Nee - Mahimanu - Iha - Lokamandali Sarvamunu
ekamuganuti Yinchuchunda - Nee Karpincheda Jihva Phalamulu
|| Sto ||
3)Idumulu Kadu - Sudulakaivadi Vadi Vadiga Nanu Penugonanga
Viduvanu Yedabaayananchu - Vijayamichchina - Yesuraajaa!
|| Sto ||
4)Maranachchaaya Loyalobadi - Teravugaanaka Naruguvela
Parama Kanikara Karamuche Nanu - Sariga Nadipina - Maadu Prabhuvaa
|| Sto ||
5)Aaraya Naalo Needu Roopamu - Sariga Nerpadu Varakunannu
Tarachu Sramala Yanubhavanbuna - Porala Jesina Yesuraajaa
|| Sto ||