Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 156

ప్రేమయా ప్రియరక్షకా

Premayaa Priyarakshaakaa

Open in Word & Worship App
తెలుగు   ప్రేమయా ప్రియరక్షకా
పల్లవి
ప్రేమామయా ప్రియరక్షకా - దయామయా మా యేసయ్యా
స్తోత్రము నీకే స్తుతియాగము నీకే - ఆరాధన నీకే మా అర్పణ నీకే
1)
ప్రార్థించితివా వేదనతో - గెత్సెమనెలో భారముతో
శ్రవియించినదా నీ చెమట - రక్తపు బిందువులుగా
ఎలా వేచియుంటివి - ఎలా ఓర్చుకుంటివి
|| ప్రేమా ||
2)
అప్పగించితివా దేహమును - కొరడాలతో కొట్టు వారికి
అప్పగించితివా నీ చెంపలను - వెంట్రుకలు పెరుకు వారికి
ఎలా మిన్నకుంటివి - ఎలా మౌనివైతివి
|| ప్రేమా ||
3)
వంచితివా నీ వీపున్‌ - దాటువారికి దారిగా
దాచలేదే నీ ముఖమున్‌ - ఉమ్మివేయువారి నుండి
ఎలా వేసారితివి - ఎలా వేగిపోతివి
|| ప్రేమా ||
4)
ప్రవహించినదా నీ ప్రేమ - యెరూషలేము వీధులలో
ప్రవహించినదా నీ రుధిరం - సిలువలో ధారలుగా
ఎలా సహియింతివి - ఎలా సాగిపోతివి
|| ప్రేమా ||
5)
పాదాలలో చేతులలో - సీలలు దించినారా
పదునైన ఈటెతో - నీ ప్రక్కలో దుర్మార్గులు పొడచినారా
ఎలా వేధించిరి - ఎలా ఒరిగిపోతివి
|| ప్రేమా ||
6)
మరణించితివా కలువరిలో - పాపాత్ముల రక్షణ కొరకై
తిరిగి లేచితివా సమాధిలో నుండి - సజీవుడైన దేవునిగా
ఆరోహణమైతివి - తిరిగి రానుంటివి
|| ప్రేమా ||
English   Premayaa Priyarakshaakaa
Chorus
Premaamayaa Priyarakshakaa - Dayaamayaa Maa Yesayyaa
Stotramu Neeke Sthuthiyaagamu Neeke - Aaraadhana Neeke Maa Arpana Neeke
1)
Praarthinchitivaa Vedanato - Getsemanelo Bhaaramuto
Sraviyinchinadaa Nee Chemata - Raktapu Binduvulugaa
Elaa Vechiyuntivi - Elaa Orchukuntivi
|| Premaa ||
2)
Appaginchitivaa Dehamunu - Koradaalato Kottu Vaariki
Appaginchitivaa Nee Chenpalanu - Ventrukalu Peruku Vaariki
Elaa Minnakuntivi - Elaa Maunivaitivi
|| Premaa ||
3)
Vanchitivaa Nee Veepun - Daatuvaariki Daarigaa
Daachalede Nee Mukhamun - Ummiveyuvaari Nundi
Elaa Vesaaritivi - Elaa Vegipotivi
|| Premaa ||
4)
Pravahinchinadaa Nee Prema - Yerooshalemu Veedhulalo
Pravahinchinadaa Nee Rudhiran - Siluvalo Dhaaralugaa
Elaa Sahiyintivi - Elaa Saagipotivi
|| Premaa ||
5)
Paadaalalo Chetulalo - Seelalu Dinchinaaraa
Padunaina Eeteto - Nee Prakkalo Durmaargulu Podachinaaraa
Elaa Vedhinchiri - Elaa Origipotivi
|| Premaa ||
6)
Maraninchitivaa Kaluvarilo - Paapaatmula Rakshana Korakai
Tirigi Lechitivaa Samaadhilo Nundi - Sajeevudaina Devunigaa
Aarohanamaitivi - Tirigi Raanuntivi
|| Premaa ||
Present