Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 151 Old No: 614

నిరాకార సురూపుడా

Niraakara Suroopudaa

Open in Word & Worship App
తెలుగు   నిరాకార సురూపుడా
పల్లవి
నిరాకారా - సురూపుడా - మనోహరా
కరిగితివా నాకై వ్రేలాడుచూ - సిలువలో
1)
వారుల దెబ్బల బాధ నొంది - వాడి మేకులతో గ్రుచ్చబడి
తీరని దాహము సహియించితివే - సిలువలో
|| నిరా ||
2)
మానవులు ఏడ్చి ప్రలాపింపగా - భూరాజులెల్లరు మాడిపోగా
శిష్యుల డెందములు పగుల - సిలువలో
|| నిరా ||
3)
అరచి ప్రాణము వీడిన సుతుడా - వైరినే నీ పాదముల
బడితిని - కోరి రక్షణ నెరవేర్చితివి - సిలువలో
|| నిరా ||
4)
కోరి సిలువ భారమును మోసితి - పాపభారమును ద్రుంచితివి
ఘోర గాయములు పొందితివి - సిలువలో
|| నిరా ||
5)
నన్ను రక్షింపను ఎన్నిపాట్లన్‌ - పన్నుగ నీవు సహించితివి
నన్ను నీ చిత్తమున్‌ బిడ్డన్‌ చేయ - సిలువలో
|| నిరా ||
6)
క్రూరుడు ప్రక్క నీటె గ్రుచ్చగా - నీరు రక్తమును కారెనయ్యా
తీరుగన్‌ రక్షణను పొందను - సిలువలో
|| నిరా ||
English   Niraakara Suroopudaa
Chorus
Niraakaaraa - Suroopudaa - Manoharaa
Karigitivaa Naakai Vrelaaduchoo - Siluvalo
1)
Vaarula Debbala Baadha Nondi - Vaadi Mekulato Gruchchabadi
Teerani Daahamu Sahiyinchitive - Siluvalo
|| Niraa ||
2)
Maanavulu edchi Pralaapinpagaa - Bhooraajulellaru Maadipogaa
Sishyula Dendamulu Pagula - Siluvalo
|| Niraa ||
3)
Arachi Praanamu Veedina Sutudaa - Vairine Nee Paadamula
Baditini - Kori Rakshana Neraverchitivi - Siluvalo
|| Niraa ||
4)
Kori Siluva Bhaaramunu Mositi - Paapabhaaramunu Drunchitivi
Ghora Gaayamulu Ponditivi - Siluvalo
|| Niraa ||
5)
Nannu Rakshinpanu Ennipaatlan - Pannuga Neevu Sahinchitivi
Nannu Nee Chittamun Biddan Cheya - Siluvalo
|| Niraa ||
6)
Kroorudu Prakka Neete Gruchchagaa - Neeru Raktamunu Kaarenayyaa
Teerugan Rakshananu Pondanu - Siluvalo
|| Niraa ||
Present