తెలుగు స్తుతియింతుము స్తోత్రింతుము
పల్లవిస్తుతియింతుము స్తోత్రింతుము - పావనుడగు మా పరమ తండ్రిని
1)నీ నామము రుజువాయె - నీ ప్రజలలో దేవా
వర్ణింప మాతరమా - మహిమగల నీ నామమును
|| స్తుతి ||
2)మా ప్రభువా మా కొరకై - సిలువలో సమసితివి
మాదు రక్షణ కొరకై - రక్తము కార్చిన రక్షకుడా
|| స్తుతి ||
3)మా ప్రభువైన యేసుని - పరిశుద్ధాత్మ ప్రియుని
ప్రియమగు కాపరులన్ - ప్రియమారగ మాకొసగిన తండ్రిని
|| స్తుతి ||
4)పరిశుద్ధ జనముగ - నిర్దోష ప్రజలనుగ
పరలోక తనయులుగ - పరమ కృపతో మార్చినదేవా
|| స్తుతి ||
5)సంపూర్ణ జ్ఞానమును - పూర్ణ వివేచనను
పరిపూర్ణంబుగ గలుగ - పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రిని
|| స్తుతి ||
6)మా ప్రభువైన క్రీస్తులో - పరలోక విషయములో
ప్రతి యాశీర్వాదమును - ప్రాపుగ నొసగిన పరమ తండ్రిని
|| స్తుతి ||
7)ఎల్లరిలో జీవజలం కొల్లగ పారునట్లు
జీవంబు నిచ్చితివి - జీవాధిపతి హల్లెలూయ
|| స్తుతి ||
English Sthuthiyimtumu Stotrimtumu
ChorusSthuthiyintumu Stotrintumu - Paavanudagu Maa Parama Tandrini
1)Nee Naamamu Rujuvaaye - Nee Prajalalo Devaa
Varninpa Maataramaa - Mahimagala Nee Naamamunu
|| Sthuthi ||
2)Maa Prabhuvaa Maa Korakai - Siluvalo Samasitivi
Maadu Rakshana Korakai - Raktamu Kaarchina Rakshakudaa
|| Sthuthi ||
3)Maa Prabhuvaina Yesuni - Parisudhaatma Priyuni
Priyamagu Kaaparulan - Priyamaaraga Maakosagina Tandrini
|| Sthuthi ||
4)Parisudha Janamuga - Nirdosha Prajalanuga
Paraloka Tanayuluga - Parama Krupato Maarchinadevaa
|| Sthuthi ||
5)Sanpoorna Gnaanamunu - Poorna Vivechananu
Paripoornanbuga Galuga - Paripoorna Krupanichchina Tandrini
|| Sthuthi ||
6)Maa Prabhuvaina Kreestulo - Paraloka Vishayamulo
Prati Yaaseervaadamunu - Praapuga Nosagina Parama Tandrini
|| Sthuthi ||
7)Ellarilo Jeevajalan Kollaga Paarunatlu
Jeevanbu Nichchitivi - Jeevaadhipati Hallelooya
|| Sthuthi ||