తెలుగు నేను ఏమి ఇవ్వలెనో
పల్లవినేను ఏమి ఇవ్వవలెనో ఏమి లేనివాడనో
నీకు ఏమి ఇవ్వగలను నాకు ఏమి ఉన్నది
ఉన్నదే ఇస్తాను - పెదవులే ఇస్తాను
నాదు హృదయపీఠము నుండి స్తుతియాగము నే చెల్లింతున్
1)పరము వీడిన నీకు - ధరకు వచ్చిన నీకు
మరణమై నా కొరకు - ధరను కట్టిన నీకు
|| నేను ||
2)నీవుండు స్థలములో - నేనుండ నాశించి
నేనున్న స్థలములో - నిలువగోరిన నీకు
|| నేను ||
3)ధనహీనుడను నేను - ధనవంతుడవు నీవు
ధనవంతునిగ జేయ - ధనము వీడిన నీకు
|| నేను ||
4)హెచ్చింపబడునట్లు - తగ్గించుకొన్నావు
నను పైకితెచ్చుటకు - క్రింద దూకిన నీవు
|| నేను ||
5)కోపాగ్ని కాల్చగా - రొట్టెతో పోల్చగా
సిలువలో తలవాల్చగా - దేహమిచ్చిన నీకు
|| నేను ||
6)దుళ్ళగొట్టన పళ్ళు - గానుగలో పిండగా
రసమైన రీతిగా - రక్తమిచ్చిన నీకు
|| నేను ||
7)నిర్జీవుడను నన్ను - జీవింప జేయుటకు
తిరిగిలేచిన నీకు - తిరిగివచ్చెడు నీకు
|| నేను ||
English Nenu Emi Ivvaleno
ChorusNenu emi Ivvavaleno emi Lenivaadano
Neeku emi Ivvagalanu Naaku emi Unnadi
Unnade Istaanu - Pedavule Istaanu
Naadu Hrudayapeethamu Nundi Sthuthiyaagamu Ne Chellintun
1)Paramu Veedina Neeku - Dharaku Vachchina Neeku
Maranamai Naa Koraku - Dharanu Kattina Neeku
|| Nenu ||
2)Neevundu Sthalamulo - Nenunda Naasinchi
Nenunna Sthalamulo - Niluvagorina Neeku
|| Nenu ||
3)Dhanaheenudanu Nenu - Dhanavantudavu Neevu
Dhanavantuniga Jeya - Dhanamu Veedina Neeku
|| Nenu ||
4)Hechchinpabadunatlu - Tagginchukonnaavu
Nanu Paikitechchutaku - Krinda Dookina Neevu
|| Nenu ||
5)Kopaagni Kaalchagaa - Rotteto Polchagaa
Siluvalo Talavaalchagaa - Dehamichchina Neeku
|| Nenu ||
6)Dullagottana Pallu - Gaanugalo Pindagaa
Rasamaina Reetigaa - Raktamichchina Neeku
|| Nenu ||
7)Nirjeevudanu Nannu - Jeevinpa Jeyutaku
Tirigilechina Neeku - Tirigivachchedu Neeku
|| Nenu ||