తెలుగు సిలువలో బలియైన దేవుని
పల్లవిసిలువలో బలియైన - దేవుని గొఱ్ఱెపిల్లా !
విలువైన నీ ప్రేమన్ - వివరింతున్ శ్రీ యేసూ !
1)ఆనాటి యూదులే - నిను జంపిరనుకొంటిన్
కాదు కాదయ్యాయ్యో - నా పాప ఋణమునకే
|| సిలు ||
2)నా యతిక్రమములకై - నలుగగొట్టబడి
నా దోషముల నెల్ల - ప్రియయేసూ మోసితివా
|| సిలు ||
3)మృదువైన నీ నుదురు - ముళ్ళపోట్లచేత
సురూపము లేక సోలిపోతివా! ప్రియుడా!
|| సిలు ||
4)నా రోగముల నీపై - నమ్రతతో భరియించి
తృణీకరింపబడి - ప్రాణమర్పించితివి
|| సిలు ||
5)వ్యసనా క్రాంతుడవుగా - వ్యాధి ననుభవించి
మౌనము ధరియించి - మరణమైతివా! ప్రభువా!
|| సిలు ||
6)నా పాప దోషముచే - నేచచ్చియుండగనే
మరణమై నా కొరకు - మరి తిరిగిలేచితివా!
|| సిలు ||
7)పరమున కెత్తబడిన - ప్రియయేసు! నీ రాకడకై
పదిలముగ కనిపెట్టి పాడెదము హల్లెలూయ
|| సిలు ||
English Siluvalo Baliyaina Devuni
ChorusSiluvalo Baliyaina - Devuni Gorrepillaa !
Viluvaina Nee Preman - Vivarintun Sree Yesoo !
1)Aanaati Yoodule - Ninu Janpiranukontin
Kaadu Kaadayyaayyo - Naa Paapa Runamunake
|| Silu ||
2)Naa Yatikramamulakai - Nalugagottabadi
Naa Doshamula Nella - Priyayesoo Mositivaa
|| Silu ||
3)Mrduvaina Nee Nuduru - Mullapotlacheta
Suroopamu Leka Solipotivaa! Priyudaa!
|| Silu ||
4)Naa Rogamula Neepai - Namratato Bhariyinchi
Truneekarinpabadi - Praanamarpinchitivi
|| Silu ||
5)Vyasanaa Kraantudavugaa - Vyaadhi Nanubhavinchi
Maunamu Dhariyinchi - Maranamaitivaa! Prabhuvaa!
|| Silu ||
6)Naa Paapa Doshamuche - Nechachchiyundagane
Maranamai Naa Koraku - Mari Tirigilechitivaa!
|| Silu ||
7)Paramuna Kettabadina - Priyayesu! Nee Raakadakai
Padilamuga Kanipetti Paadedamu Hallelooya
|| Silu ||