Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 141 Old No: 91

రాజులకు రాజైన

Raajulaku Raajaina

Open in Word & Worship App
తెలుగు   రాజులకు రాజైన
పల్లవి
రాజులకు రాజైన యీ మన విభుని పూజ చేయుటకు
రండి ఈ జయశాలికన్న - మనకింక రాజెవ్వరును లేరని
1)
కరుణగల సోదరుండై - ఈయన ధరణి కేతెంచెనయ్యా
స్థిరముగా నమ్ముకొనిన మన కొసగు - బరలోక రాజ్యమ్మును
|| రాజు ||
2)
నక్కలకు బొరియలుండె - నాకాశ పక్షులకు గూళ్లుండెను
ఒక్కింత స్థలమైనను - మన విభునికెక్కడ లేకుండెను
|| రాజు ||
3)
కరము నందొక్క రెల్లు - పుడకను దిరముగా నునిచి - వారల్‌
ధరణీపతీ శ్రేష్ఠుడా - నీ కిపుడు దండమనుచు మొక్కిరి
|| రాజు ||
4)
అపహాసములు సేయుచు - నాయన యాననము పై నుమియుచు
గృప మాలిన సైనికులందరును - నెపములెంచుచు గొట్టిరి
|| రాజు ||
5)
ఇట్టి శ్రమలను బొందిన రక్షకుని - బట్టుదలతో నమ్మిన
నట్టహాసముతోడను - బరలోక పట్టణంబున జేర్చును
|| రాజు ||
6)
శక్తిగల రక్షకుండై - మన కొరకు ముక్తి సిద్ధముజేసెను
భక్తితో బ్రార్థించిన - మనకొసగు రక్తితో నా ముక్తికి
|| రాజు ||
7)
త్వరపడి రండి రండి - యీ పరమ గురునియొద్దకు మిరలు
దరికి జేరినవారిని - యీ ప్రభువు దరుమడెన్నడు దూరము
|| రాజు ||
English   Raajulaku Raajaina
Chorus
Raajulaku Raajaina Yee Mana Vibhuni Pooja Cheyutaku
Randi Ee Jayasaalikanna - Manakinka Raajevvarunu Lerani
1)
Karunagala Sodarundai - Eeyana Dharani Ketenchenayyaa
Sthiramugaa Nammukonina Mana Kosagu - Baraloka Raajyammunu
|| Raaju ||
2)
Nakkalaku Boriyalunde - Naakaasa Pakshulaku Goollundenu
Okkinta Sthalamainanu - Mana Vibhunikekkada Lekundenu
|| Raaju ||
3)
Karamu Nandokka Rellu - Pudakanu Diramugaa Nunichi - Vaaral
Dharaneepatee Sreshthudaa - Nee Kipudu Dandamanuchu Mokkiri
|| Raaju ||
4)
Apahaasamulu Seyuchu - Naayana Yaananamu Pai Numiyuchu
Grupa Maalina Sainikulandarunu - Nepamulenchuchu Gottiri
|| Raaju ||
5)
Itti Sramalanu Bondina Rakshakuni - Battudalato Nammina
Nattahaasamutodanu - Baraloka Pattananbuna Jerchunu
|| Raaju ||
6)
Saktigala Rakshakundai - Mana Koraku Mukti Sidhamujesenu
Bhaktito Braarthinchina - Manakosagu Raktito Naa Muktiki
|| Raaju ||
7)
Tvarapadi Randi Randi - Yee Parama Guruniyoddaku Miralu
Dariki Jerinavaarini - Yee Prabhuvu Darumadennadu Dooramu
|| Raaju ||
Present