Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 140 Old No: 90

మన పాపముల నిమిత్తము

Mana Paapamula Nimittamu

Open in Word & Worship App
తెలుగు   మన పాపముల నిమిత్తము
పల్లవి
మన పాపముల నిమిత్తము తన ప్రాణము నిచ్చెను
ఏలాగున మరతుము యేసుని స్తుతియింతుము
1)
పిలాతు యూదులమెప్పును గోరి - మరణమునకై యిచ్చెను
యేసున్‌ - నీతిమంతుని నిందలుమోపి తలనుగొట్టిరి
ముండ్లకిరీటం - నీచముగ నిందించిరి
|| మన ||
2)
ఎఱ్ఱటెండలో యేసుక్రీస్తును - సిలువ వేసిరి గొల్గొతాలో
త్రాగనిచ్చిరి చేదు చిరక - మరణ సిల్వపైనుంచిరి
అపహసించిరి యూదులు
|| మన ||
3)
ఎలీలామా సబక్తా నీయని - తండ్రికి తనయాత్మను
యిచ్చెన్‌ - తండ్రి చిత్తమును నెరవేర్చి పాపులను రక్షించెను
పరలోకమునజేర్చెను
|| మన ||
4)
సిలువపై తన ప్రాణము పోయెన్‌ - జీకటాయెను దేశ మంత
ఆలయపు తెర దీటుగా చినిగెన్‌ - భూమి కంపము జెందెను
తెరువబడెను సమాధులు
|| మన ||
5)
సమాధిలో ప్రభు శరీరముంచి - పెద్దరాతిని యుంచిరిభటులు
ముద్రవేసి సమాధిపైన కావలుండిరి - రాతిరి భద్రముగ పరికించిరి
|| మన ||
6)
తిరిగి మూడవదినమునలేచి - తండ్రి యొద్దకు వెళ్ళెను యేసు
తిరిగి మరల వచ్చి ప్రభువు మనల పరమున చేర్చును
సన్నుతింతుము యేసుని
|| మన ||
English   Mana Paapamula Nimittamu
Chorus
Mana Paapamula Nimittamu Tana Praanamu Nichchenu
elaaguna Maratumu Yesuni Sthuthiyintumu
1)
Pilaatu Yoodulameppunu Gori - Maranamunakai Yichchenu
Yesun - Neetimantuni Nindalumopi Talanugottiri
Mundlakireetan - Neechamuga Nindinchiri
|| Mana ||
2)
Erratendalo Yesukreestunu - Siluva Vesiri Golgotaalo
Traaganichchiri Chedu Chiraka - Marana Silvapainunchiri
Apahasinchiri Yoodulu
|| Mana ||
3)
Eleelaamaa Sabaktaa Neeyani - Tandriki Tanayaatmanu
Yichchen - Tandri Chittamunu Neraverchi Paapulanu Rakshinchenu
Paralokamunajerchenu
|| Mana ||
4)
Siluvapai Tana Praanamu Poyen - Jeekataayenu Desa Manta
Aalayapu Tera Deetugaa Chinigen - Bhoomi Kanpamu Jendenu
Teruvabadenu Samaadhulu
|| Mana ||
5)
Samaadhilo Prabhu Sareeramunchi - Peddaraatini Yunchiribhatulu
Mudravesi Samaadhipaina Kaavalundiri - Raatiri Bhadramuga Parikinchiri
|| Mana ||
6)
Tirigi Moodavadinamunalechi - Tandri Yoddaku Vellenu Yesu
Tirigi Marala Vachchi Prabhuvu Manala Paramuna Cherchunu
Sannutintumu Yesuni
|| Mana ||
Present