తెలుగు పాడెద దేవా నీ కృపలన్
పల్లవిపాడెదదేవా నీ కృపలన్ - నూతన గీతములన్
స్తోత్రము చెల్లింతున్ - స్తుతిస్తోత్రము చెల్లింతున్
1)భూమి పునాదుల వేయకముందే - యేసులో జూచితివి
ప్రేమపునాదులు వేసితివి - దీనుని బ్రోచితివి
ఈ దీనుని బ్రోచితివి
|| పాడెద ||
2)ప్రవిమల రక్తము కలువరి సిలువలో - ఖలునకు నిచ్చితివి
ప్రేమ కృపా మహదైశ్వర్యములతో - పాపము తుడిచితివి
నా పాపము తుడిచితివి
|| పాడెద ||
3)పాపము శాపము నరకపువేదన - మరి తొలగించితివి
అపరాధములచే చచ్చిన నన్ను - ధర బ్రతికించితివి
నను బ్రతికించితివి
|| పాడెద ||
4)దేవుని రాజ్యపు వారసుడనుగా - క్రీస్తులో జేసితివి - చీకటి
రాజ్యపు శక్తుల నుండి - నను విడిపించితివి- చెరవిడిపించితివి
|| పాడెద ||
5)ముద్రించితివి శుద్ధాత్మతొనను - భద్రము జేసితివి
సత్యస్వరూపీ నిత్యనివాసి - సొత్తుగా జేసితివి
నీ సొత్తుగ జేసితివి
|| పాడెద ||
6)అన్యుడనై నిన్నెరుగక యున్నను - ధన్యుని జేసితివి
ప్రియపట్టణ పౌరుల సేవింపను - వరముల నొసగితివి
కృపవరముల నొసగితివి
|| పాడెద ||
English Paadeda Devaa Nee Krpalan
ChorusPaadedadevaa Nee Krupalan - Nootana Geetamulan
Stotramu Chellintun - Sthuthistotramu Chellintun
1)Bhoomi Punaadula Veyakamunde - Yesulo Joochitivi
Premapunaadulu Vesitivi - Deenuni Brochitivi
Ee Deenuni Brochitivi
|| Paadeda ||
2)Pravimala Raktamu Kaluvari Siluvalo - Khalunaku Nichchitivi
Prema Krupaa Mahadaisvaryamulato - Paapamu Tudichitivi
Naa Paapamu Tudichitivi
|| Paadeda ||
3)Paapamu Saapamu Narakapuvedana - Mari Tolaginchitivi
Aparaadhamulache Chachchina Nannu - Dhara Bratikinchitivi
Nanu Bratikinchitivi
|| Paadeda ||
4)Devuni Raajyapu Vaarasudanugaa - Kreestulo Jesitivi - Cheekati
Raajyapu Saktula Nundi - Nanu Vidipinchitivi- Cheravidipinchitivi
|| Paadeda ||
5)Mudrinchitivi Sudhaatmatonanu - Bhadramu Jesitivi
Satyasvaroopee Nityanivaasi - Sottugaa Jesitivi
Nee Sottuga Jesitivi
|| Paadeda ||
6)Anyudanai Ninnerugaka Yunnanu - Dhanyuni Jesitivi
Priyapattana Paurula Sevinpanu - Varamula Nosagitivi
Krupavaramula Nosagitivi
|| Paadeda ||